Singer chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు!

Singer chinmayi: సింగర్ చిన్మయి పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళలకు మద్దతు తెలుపుతూ చేసే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా మహిళలకు మద్దతుగా ఈమె మాట్లాడటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.

మహిళలు వేసుకొని జాకెట్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఒక అబ్బాయి చున్ని వేసుకొని ఈ మధ్యకాలంలో అమ్మాయిలు చున్నీలు వేసుకోవడానికి ఎంతో బరువు పడుతున్నారు అందుకే తాను చున్ని వేసుకుంటున్నానని అప్పుడైనా వారికి జ్ఞానోదయం కలుగుతుంది అంటూ ఒక వీడియోని చేశారు.

ఇక ఈ వీడియో పై చిన్మయి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.. అమ్మాయిలు చున్నీలు వేసుకోలేదు అని మాట్లాడే ముందు మన భారత దేశ సంస్కృతి గురించి తెలుసుకొని మాట్లాడటం ఎంతో మంచిదని తెలియజేశారు. భారతదేశంలో మహిళలు జాకెట్ వేసుకోకపోవడమే సాంప్రదాయం అని ఈమె తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ భార్య జ్ఞాన నందిని దేవి ఆడవాళ్లు జాకెట్ వేసుకునే కల్చర్ తీసుకువచ్చారని చిన్మయి తెలిపారు.

 

అప్పట్లో మహిళలు చీర కొంగుతోనే జాకెట్ గా మడిచి వేసుకునేవారు. జాకెట్ కల్చర్ అనేది బ్రిటిష్ వారి కల్చర్ అని ఈమె తెలియజేశారు.బ్రిటిష్ వారు జాకెట్ లేనటువంటి భారతీయ మహిళలను చూసి లైంగిక కోరికలు పెంచుకోవడం వల్లే ఈ జాకెట్ కల్చర్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.ఇలా చున్నీలు వేసుకోవడం గురించి మాట్లాడేవారు ముందు ప్యాంటు షర్ట్ వేసుకోవడం మానేసి పంచలు కట్టుకోవాలని సూచించారు. దేని గురించి మాట్లాడిన విజ్ఞాన పెంచుకోవడం కోసం మాట్లాడాలి కానీ కామంతో చూస్తూ అలాగే ఆలోచిస్తూ మాట్లాడకూడదని ఈ సందర్భంగా చిన్మయి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -