Singer Sunitha: మళ్లీ తల్లి కాబోతున్న సునీత.. ఫ్యాన్స్ ఆనందించేలా?

Singer Sunitha: సునీత.. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. మొదటగా టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా బాధ్యతలు చేపట్టారు. 15 ఏళ్ల వయసులో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ‘గులాబీ, ఎగిరే పావురమా’ సినిమా ద్వారా గాయనిగా సునీతకు మంచి పేరు వచ్చింది. 8 ఏళ్లలో దాదాపు 500 సినిమాలకు సునీత వాయిస్ ఇచ్చారు. సింగర్ సునీతకు 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ. పిల్లలు కూడా సింగర్‌గానే కెరీర్ స్టార్ట్ చేశారు. సునీత-కిరణ్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తడంతో.. విడాకులు తీసుకుని దూరమయ్యారు. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 

 

తాజాగా సింగర్ సునీత- రామ్ వీరపనేనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సింగర్ సునీత తల్లి కాబోతుందనే వార్త వైరల్ అవుతోంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సునీత.. మరో పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతోంది. నడి వయసులో ఉన్న వీరిద్దరూ పిల్లలు కనాలని నిర్ణయించుకున్నారట. అందుకే సునీత రీకానలైజేషన్ సర్జరీ చేయించారని ప్రచారం జరుగుతోంది. సునీత మరోసారి తల్లి కాబోతున్నట్లు వార్తలు విన్న అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు. కాగా, ఇటీవలే సింగర్ సునీత తన కొడుకు ఆకాష్‌ను సినిమాల్లో హీరోగా పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సునీత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ విషయాన్ని తెలిపింది.

 

 

సింగర్ సునీత.. ఠాగూర్, చూడాలని ఉంది, మనసంతా నువ్వే, జయం, ఇంద్ర, ఒకరికి ఒకరు, నేనున్నాను, ఆనంద్, మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి, శ్రీ రామదాసు, గోదావరి, హ్యాపీడేస్, కంత్రి, సింహ, శ్రీరామరాజ్యం వంటి సినిమాల్లో డబ్బింగ్ కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, జడ్జిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -