ఫోన్ కోసం గొడవ.. అక్క మండలించడంతో ఊహించని పని చేసిన చెల్లి!

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో స్మార్ట్ ఫోన్ అతివినియోగం కారణంగా క్రమం క్రమంగా బంధాలు బలహీన పడుతున్నాయి. ఒకపూట భోజనం లేకపోయినా పర్లేదు స్మార్ట్ ఫోన్ లేకపోతే గడవదు అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. కాలక్షేపం కోసం మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న యువత దానికి అలవాటు పడి మొబైల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని కుటుంబాలలో చాలామంది కలిపి ఒకే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటోంది. ఇక ఆ స్మార్ట్ ఫోన్ కోసం ఆ ఇంట్లో గొడవలు పడుతూనే ఉంటారు.

ఇటువంటి క్రమంలోనే ఆ స్మార్ట్ ఫోన్ కోసం గొడవలు పడి సహనం కోల్పోయి ఆ కోపంలో ఏం చేస్తున్నారు తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. తాజాగా ఒక సెల్ ఫోన్ కుటుంబంలో అక్క చెల్లెల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ లోని కూషాయిగూడ కట్టింగ్ కాలనీలో ఓ మేస్త్రి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో పెద్ద అమ్మాయి(17) ఇంటర్ చదవగా ఆమెకి కొన్నాళ్ల క్రితం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె తన కొచ్చిన జీతంలో కొంత డబ్బను జమ చేసుకొని, ఇటీవల ఓ మొబైల్ ఫోన్ కోనుగోలు చేసింది. ఆమెతోపాటు ఆమె చెల్లి కూడా ఆ ఫోన్ ని తరచుగా వినియోగిస్తూ ఉండేది.

అయితే ఇంట్లో ఉన్నది ఆ ఒక్క ఫోన్ కావడంతో అక్క చెల్లెళ్లు ఇద్దరూ దాన్ని వాడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ ఫోన్ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అక్క చెల్లిని నీకెందుకు ఫోన్, అంత అవసం ఏముంది?అంటూ గట్టిగా మందలించింది. దీంతో మనస్తాపం చెందిన చెల్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కుషాయిగూడా పోలీసులు ఘటన స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అలా ఒక్కమాట అన్నందుకు ఆ యువతి క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -