Sitara: మహేష్ కూతురు గ్రేట్.. పాకెట్ మనీ ఇవ్వడంతో?

Sitara: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఘట్టమనేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో మహేష్ బాబు.. ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. బాలనటుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మహేష్ బాబు.. అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు తెలుగు ఏ స్టార్ హీరోకు లేనంత రేంజ్ ను సంపాదించాడు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా మహేష్ బాబు ఎంతో చురుకుగా పాలుపంచుకుంటూ ఉంటాడు.

 

మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను ఆదుకోవడంలో మహేష్ బాబుకు ఎంతో పేరుంది. ఎన్నో వేల మంది చిన్నారుల గుండె ఆపరేషన్లకు మహేష్ బాబు ముందుకు రావడం, ఎంతో మంది పిల్లలకు ఉచిత విద్య, వైద్యాన్ని అందించడానికి చేయూత అందించడం ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా అతడికి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో మంచి పనులు చేస్తున్న హడావిడికి దూరంగా ఉంటూ వస్తున్న మహేష్ బాబు.. కొత్త ఏడాది వేళ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు.

 

ఇప్పటి వరకు మహేష్ బాబు చిన్నారుల కోసం చేస్తూ వస్తున్న సేవా, సహాయ కార్యక్రమాలకు ఇప్పుడు ఓ వేదికను ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయాడు. అందులో భాగంగా ఓ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తూ.. మహేష్ బాబు కూతురు ఓ ప్రకటన విడుదల చేసింది. http://maheshbabufoundation.org పేరుతో మహేష్ బాబు వెబ్ సైట్ ద్వారా తన సహాయ సహకారాలను అందించనుండగా.. ఈ సందర్భంగా మహేష్ కూతురు సితార చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

 

తన తండ్రి పేరు మీద ప్రారంభిస్తున్న వెబ్ సైట్ కోసం తన వంతుగా తన పాకెట్ మనీని డొనేట్ చేస్తున్నట్లు సితార అధికారికంగా ఓ వీడియో ద్వారా వెల్లడించింది. కొత్త సంవత్సరం వేళ ఇలా వెబ్ సైట్ ను ప్రారంభిస్తుండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన సితార.. ఫౌండేషన్ ద్వారా అందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. దీంతో గొప్ప వాళ్ల కడుపున గొప్ప వాళ్లే పుడతారు అంటూ అందరూ సితారను మెచ్చుకుంటున్నారు. ఆమె చేసిన పనికి అందరూ ఆమెను గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -