Sitaramam-Karthikeya: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ చిత్రాలు.. ఎప్పుడంటే?

ఇది వరకు సినిమా విడుదల అవుతుంది అంటే కేవలం విడుదల తేదీని మాత్రమే ప్రకటించేవారు. కానీ రాను రాను థియేటర్లలో విడుదల తేదీతో పాటు ఓటీటీ విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటిస్తున్నారు. కాగా ఇప్పటికే గత నెల అనగా జూలై నెలలో విడుదలైన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల అనగా ఆగస్టులో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఆగస్టులో విడుదలైన సినిమాల ఓటీటీ విడుదల తేదీలు కూడా ఫిక్స్ అయ్యాయి.

మరి ఆగస్టులో విడుదలైన సినిమాలు ఏ తేదీన ఓటీటీ లో విడుదల కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇటీవల ఫిలిం ఛాంబర్ ఒక సినిమా విడుదలైన 8 వారాల తరువాత ఓటీటీ లో విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల విడుదలై బింబిసార, కార్తికేయ 2, సీతారామం సినిమాలు ఫిలిం ఛాంబర్ తీసుకుని నిర్ణయం కంటే ముందుగానే ఓటీటీలో విడుదల కాబోతున్నాయి అని సమాచారం. మరి ఆగస్టు నెలలో విడుదలైన ఏ సినిమాలు ఓటీటీ లో ఎప్పుడు విడుదల కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సెప్టెంబరు 9 జీ 5 లో విడుదల కానుంది.

అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం కూడా సెప్టెంబరు 9 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో విడుదల కానుంది. అదేవిధంగా ఇంగ్లీష్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా సెప్టెంబరు ఆఖరి వారంలో జీ 5 లో విడుదల కానుంది. నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా సెప్టెంబర్ 9 న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఇక విరుమన్‌ సినిమా సెప్టెంబరు 9 లేదా 10 తేదీలలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. తిరు సినిమా సెప్టెంబరు ఆఖరి వారంలో నెట్‌ఫ్లిక్స్ లేదా సన్‌నెక్ట్స్ లో విడుదల కానుంది. రక్షాబంధన్‌ సినిమా జీ 5 లో విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -