SJ Suriya: సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో అతనికి మ్యానర్స్ లేదా.. మరీ ఘోరంగా అవమానించాడా?

SJ Suriya:  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు గురించి దర్శకుడు ఎస్ జె సూర్య మార్క్ అంటోనీ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు భాగంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన కొంతమంది హీరోలతో హిట్ సినిమాలను చేసి మంచి సక్సెస్ అందించారు.

ఎస్ ఎస్ సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేశారు అయితే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు సినీ కెరీర్లు డిజాస్టర్ సినిమా ఏదైనా ఉందా అంటే అది నాని సినిమా అని చెప్పాలి. ఇలా నాని సినిమాకు ఎస్ సూర్య దర్శకత్వం వహించారు ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ వేదికపై ఎస్ జె సూర్య మాట్లాడుతూ… తాను మహేష్ బాబుకి హిట్ సినిమా ఇవ్వలేకపోయానని దాంతో మహేష్ బాబుకి బాకీ ఉన్నానని తెలిపారు.

ఎప్పటికైనా మహేష్ బాబుతో ఒక హిట్ సినిమా చేసి ఆయన బాకీ చెల్లిస్తాను అంటూ ఈ వేదికపై సూర్య చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. మహేష్ బాబుతో నువ్వు సినిమా చేస్తావా నీ స్థాయి ఏంటి మహేష్ బాబు స్థాయి ఏంటి మహేష్ బాబు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్ తనది అలాంటి ఆయనతో నువ్వు సినిమా చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

ఇలా పెద్ద వేదికపై మహేష్ బాబుతో సినిమా చేస్తాను అని ప్రకటించితే మహేష్ బాబు నీకు కాల్ షీట్స్ ఇస్తారన్న ఉద్దేశంతోనే అందరి ముందు ఇలాంటి మాటలు మాట్లాడవా అంటూ మండిపడుతున్నారు. ఎలా ఒక వేదికపై స్టార్ హీరో గురించి ఇలా మాట్లాడటానికి కొంచమైనా మ్యానర్స్ ఉందా అంటూ ఈయనని ప్రశ్నిస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ సినిమా చేయబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -