Sleeping Habits: మీరు నిద్రపోయే సమయం 6గంటల కంటే తక్కువా? అయితే జాగ్రత్త!

Sleeping Habits: మనిషి ఆరోగ్యంలో నిద్ర చాలా ముఖ్యం. నిద్ర వల్ల అలసిపోయిన బాడీ మొత్తం శక్తిని తిరిగి పొందుతుంది. ఇక ఎన్నో రోగాలకు నిద్ర సహజ ఔషదంగా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ప్రతి అవయవానికి తిరిగి సత్తువ చేరుతుంది. అయితే అతి నిద్ర అయినా, నిద్ర తక్కువ అయినా అది ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్ర తక్కువ అవడం వల్ల గ్లూకోజ్ అసమతుల్యత.
నిద్రలేమి సమస్య వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసహజంగా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి, నిద్ర సమయాల్లో గ్లూకోజ్ పెరుగుదల సహజమే కానీ దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలుస్తోంది. ఇది అలాగే కొనసాగితే టైప్-2 డయాబెటిస్ గా రూపాంతరం చెందుతుంది. స్థూలకాయం సమస్య కూడా దీనివల్ల కలుగుతుంది.

ఇక సాధారణంగా మనకు 7 నుండి 8గంటల నిద్ర అవసరం. ఈ నిద్ర కూడా సరైన సమయంలో పోవాలి. దీనివల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి అవయవం నిద్రలో శక్తిని పొందుతుంది. ఇలా సరైన నిద్ర పోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, స్థూలకాయ సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మధుమేహం ఉన్నవారు అయితే నిద్ర విషయంలో మరింత జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరికి గుండె జబ్బులు వచ్చే ఛాన్సులు అధికం. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా 6 గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారిలో కార్టిసాల్ అధికంగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను దారితీస్తుంది. కాబట్టి తగినంత నిద్ర, సరైన సమయంలో పోయి ఆరోగ్యాంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -