Sleeping Tablets: నేటి కాలంలో రెండు చేతులతో పని చేస్తేనే కుటుంబం గడుస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు పెడితేనే చేతి నిండా డబ్బు వస్తోంది. ఆ డబ్బు సంపాదించే క్రమంలో, పనుల ఒత్తిడిల కారణంగా సరిపడ నిద్ర లేక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాంటి కారణాలతో నిద్ర మాత్రాలు వేసుకుని నిద్ర పోతుంటారు. అలాంటి నిద్ర మాత్రలు వేసుకోవడంతో దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
నిద్రమాత్రలు వాడటంతో మెదడును క్రమంగా ప్రభావితం చేస్తోందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ యాంటీ కోలినెర్జిక్ మాత్రలు, నిద్ర మాత్రలు జ్ఞాపకశక్తిని క్రమంగా బలహీనపరుస్తాయి. ఒక వ్యక్తికి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ మందులు వాటంతట అవే ప్రభావాన్ని చూపిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా నిద్రమాత్రలు వినియోగించే వారి మరణాల శాతం కూడా పెరిగిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. తరచూ నిద్రమాత్రలు వాడటంతో అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. వైద్యుడి సూచనాల మేరకు నిద్ర మాత్రలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. నిద్రమాత్రలు రెగ్యులర్ వినియోగంతో మలబద్ధకం, బలహీనమైన జ్ఞాపకశక్తి, కడుపు నొప్పి, బలహీనత, మైకం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇవి పాటించండి..
1. నిద్రపోయేందుకు ఓ సమయాన్ని కేటాయించాలి. నిద్రపోయే, మేల్కొనే సమయం రెండింటి నిర్ణయంతో మీ రొటీన్ లైఫ్ మాములు స్థాయికి వస్తోంది.
2. అర్ధరాత్రి వరకు టీవీ, ఫోన్లు చూడరాదు. నిద్రపోకుండా ఉండటంలో మీ మొబైల్, టీవీ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి దాని వ్యసనాన్ని విడిచిపెట్టి త్వరగా నిద్రపోయేలా టైమ్ సెట్ చేసుకోవాలి.
3. నిద్రపోయే సమయంలో మంచి ఆలోచనలను మనస్సులో ఉంచుకోండి.అలాచేస్తే హాయిగా నిద్ర పోవచ్చు.
4. టీ, కాïఫీలను ఎక్కువగా తాగరాదు. వీటిని ఎక్కువగా తాగితే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
5. అరికాళ్లకు మసాజ్ చేయండి పడుకునే ముందు చేతులు, కాళ్లు కడుక్కుని పడుకోవాలి. 6. ఏదైనా నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయాలి. ఇలా చేసుకుంటే నిద్రలేమి సమస్య దూరమై ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.