Small Screen Megastar: ప్రభాకర్ తో పాటు అతని ఫ్యామిలీ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసిన అవినాష్

Small Screen Megastar: బుల్లితెర మీద నటించే నటీనటులకు ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రోజు సీరియల్స్ ద్వారా వాళ్లు ఎప్పుడూ ఆడియన్స్ను పలకరిస్తూ ఉండడంతో వారిని సొంత ఇంటి మనుషుల్లా ఫీలవుతూ ఉంటారు. సీరియల్ లో జరిగే స్టోరీని తమ ఇంట్లో జరిగే ముచ్చట లాగా చెప్పుకోవడం ప్రేక్షకులకు ఎప్పటినుంచో అలవాటు. మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో సీరియల్స్ కదా ఎంత గట్టిగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

 

అలా గుర్తింపు తెచ్చుకున్న నటులలో ప్రభాకర్ ఒకరు. ఏకంగా బుల్లితెరపై మెగాస్టార్ గా ఎదిగిన అతను తెలుగింటి సీరియల్ ప్రేక్షకులందరికీ సుపరిచితుడు. సీరియల్స్ లోనే కాక ప్రభాకర్ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. అయితే ఈ సీనియర్ నటుడికి ఇటీవల స్టేజీ పైన అవమానం జరిగింది. అతని గురించే కాకుండా అతని కుటుంబం గురించి కూడా ఒక మీడియం షాకింగ్ కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

ఇటీవల ప్రభాకర్ తన కొడుకు చంద్రహాసన హీరోగా పరిచయం చేయడానికి అనౌన్స్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. అందులో చంద్రహాస్ తనదైన ఆటిట్యూడ్ తో నేర్చుకొని ఫోజులు ఇవ్వడం పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ప్రభాకర్ అటువంటి ట్రోలింగ్ కి కూడా పాజిటివ్ గానే స్పందించారు. ఎలాగైతే ఏమి మా అబ్బాయి అందరికీ తెలిసాడు అది చాలు అన్నట్టు ఆయన మాట్లాడడం ఆయన మనోనివ్వరానికి నిదర్శనం.

రీసెంట్గా కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ తరఫున ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సీరియల్ దీంతోపాటు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే మరో సీరియల్ నటీనటులు కూడా వచ్చారు. వీరిలో బిగ్ బాస్ తెలుగు సిక్స్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ కూడా ఉన్నారు.

ఈ షోలో భాగంగా శ్రీముఖి వచ్చిన అందరితో గేమ్స్ ఆడించే విషయం తెలిసింది. తాజాగా ఈ షో కి సంబంధించి విడుదలైన ప్రోమోలో కమెడియన్ అవినాష్ ఇద్దరు ముద్దుగుమ్మను ఎత్తుకున్నాడు. వెంటనే పెళ్లయిన తర్వాత ఎప్పటికీ మీ ఆవిడని ఎన్నిసార్లు ఎత్తుకున్నావు అవినాష్ అని శ్రీముఖి అడిగింది. దీనికి అవినాష్ సమాధానం చెప్పకపోవడంతో శ్రీముఖి నేరుగా స్టేజీపై నుంచి అవినాష్ భార్య అనుజాకు కాల్ చేసి అడిగింది. ఇప్పటివరకు ఒక మూడు నాలుగు సార్లు అని ఆమె సమాధానమివ్వడంతో అయ్యో అయితే ప్రోగ్రాం లో ఇప్పటికే ముగ్గురిని ఎత్తుకున్నాడు అని శ్రీముఖి తమాషాగా చెప్పింది.

అయితే శ్రీముఖి మాటలకు అది ప్రమోషన్ లో భాగం అన్నట్లుగా అవినాష్ భార్య స్పందించింది. అదే టైం కి అది ప్రమోషన్ కాదు వాడి ప్రొఫెషన్ ఏ అది అని చెప్పండి అని ప్రభాకర్ పంచ్ విసిరాడు. ఆ మాటకు అవినాష్ అప్పటికి స్పందించకపోయినా గేమ్ ఎండింగ్లో ఎందుకురా నీకు అంత ఆటిట్యూడ్ అని ప్రభాకర్ అన్నప్పుడు మీ అబ్బాయికి ఎందుకంత యాటిట్యూడ్ అని తిరిగి ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

అవినాష్ మాటలకు కోపం వచ్చిన ప్రభాకర్ ఆటిట్యూడ్ తగ్గించుకో అని సీరియస్గా అన్నారు. వెంటనే ప్రభాకర్ మాటలకు రియాక్ట్ అయిన అవినాష్ ఆటిట్యూడ్ నాకు లేదు అర్థమైందా , ఆటిట్యూడ్ మీకు మీ ఫ్యామిలీకి ఉంది అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అవినాష్ అంత ఓపెన్ గా ప్రభాకర్ ఫ్యామిలీ గురించి కామెంట్ చేయడం తో ప్రభాకర్ తో పాటు అక్కడున్న అందరూ షాక్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -