Sneha Reddy: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న బన్నీ భార్య.. హీరో ఎవరంటే?

Sneha Reddy: టాలీవుడ్ లో మంచి యాక్టర్, డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. ‘పుష్ఫ’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సౌతిండియాలో ఏ స్టార్ హీరోకు లేనంత డిమాండ్, క్రేజ్ అల్లు అర్జున్ సొంతం. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ను అక్కడ మల్లు అర్జున్ అని ప్రేమతో పిలుస్తుండటం తెలిసిందే.

 

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. స్నేహను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లు అర్జున్.. ఆమెకు ప్రతి విషయంలో అండగా నిలుస్తాడట. తాజాగా ఈమెకు సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్SnehaReddy అవుతోంది. అల్లు అర్జున్ భార్య స్నేహ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

హీరోయిన్లకు అందంలో ఏమాత్రం తగ్గకుండా ఉన్న స్నేహ.. హీరోయిన్ గా చేస్తే తప్పేంటని అప్పుడే అల్లు ఫ్యాన్స్ ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కానీ ఫిట్నెస్ విషయంలో స్నేహ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఆమె అందం అందరినీ ఫిదా చేస్తుంటుంది. స్నేహకు ఇన్ స్టాగ్రాంలో 8.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

స్నేహ మలయాళంలో ఓ సినిమాకు ఓకే చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కథను స్నేహకు వివరించగా.. ఆమెకు ఆ కథ బాగా నచ్చిందట. దాంతో తన భర్త అల్లు అర్జున్ కు ఫోన్ చేసి అడిగిందట. నీకు ఓకే ఉంటే ఒప్పేసుకో అన్నట్లు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మొత్తానికి అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని స్నేహ.. త్వరలోనే హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద కనువిందు చేయనుందనే వార్త అల్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -