Sneha: స్నేహను ఇంతమంది మగాళ్లు ఇబ్బంది పెట్టారా.. ఏం జరిగిందంటే?

Sneha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి స్నేహ ఒకరు. 2000 సంవత్సరంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె తెలుగు తమిళ భాషలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి స్నేహ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇక ఈమె సినిమాలలో నటిస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈమె నటిగా అందరికీ తెలిసినప్పటికీ తన కుటుంబ విషయాలు తన చిన్నప్పటి విషయాల గురించి చాలా మందికి తెలియవు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి స్నేహ తన బాల్యం గురించి బాల్యంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

తన తల్లిదండ్రులకు నలుగురు కూతుర్లు ఇద్దరు కుమారులు సంతానం అని తెలిపారు కూతుర్లలో తాను చిన్నదానినని తెలిపారు. అయితే తనకు బదులు కుమారుడు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకున్నారని కాకపోతే కొడుకు బదులు తాను పుట్టడంతో మూడు రోజుల పాటు తన బామ్మ తన మొహం కూడా చూడలేదని స్నేహ తెలిపారు. ఇక చిన్నతనంలో తన సోదరులకు తాగడానికి నీళ్లు పక్కనే ఉన్న వాళ్లకు మేమే నీళ్లు అందించే వాళ్ళమని తెలిపారు.

 

పక్కనే ఉన్నాయి కదా తాగండి అని చెప్పగా మేము మగవాళ్ళ మేము ఇలాగే ఉంటాం మీరే ఇంట్లో పనులన్నీ చేయాల్సి ఉంటుందని అన్ని పనులు మాకే చెప్పే వారని స్నేహ తెలిపారు.ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనని చాలా ఇబ్బందులు పెట్టారని ప్రతి చిన్న పని తానే చేయాలని కండిషన్లు పెడుతూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు అంటూ ఈ సందర్భంగా స్నేహ తన సోదరుల గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -