Sohel: ట్రోల్స్ చేసేవారిని గుడ్డలిప్పి కొడతానని సోహైల్

Sohel: సోహైల్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహైల్ అంటే ఎవ్వరైనా గుర్తుపడతారు. ఆ షో ద్వారా సోహైల్ బాగా పాపులర్ అయ్యాడు. వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. తాజాగా సోహైల్ `లక్కీ లక్ష్మణ్‌` సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం హైదరాబాద్‌లో వేడుకగా సాగింది. ఈవెంట్ లో సోహైల్‌ ట్రోలర్స్ కి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

 

తన ఫ్యామిలీ జోలికొస్తే వెతికి మరీ కొడతానంటూ సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిగ్‌ బాస్‌ 4 ఫైనల్‌లో సోహైల్‌ రూ.25 లక్షల ఆఫర్‌ తీసుకుని బయటికొచ్చేశాడు. అప్పట్లో అసలైన విన్నర్ సోహైల్ అంటూ అందరూ అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు కూడా సోహైల్ ను ఎంతగానో అభినందించారు. మొత్తంగా బిగ్ బాస్ 4 సీజన్‌లో అభిజిత్‌ విన్నర్ అయినా ఆడియన్స్ హార్ట్స్ ను గెలుచుకున్నది సోహైల్ అని అందరూ చెప్పుకున్నారు.

 

అయితే సోహైల్ ఆఫర్‌ తీసుకుని వెళ్లడం పట్ల కొందరు విపరీతంగా కామెంట్స్ చేశారట. సోహైల్ స్కామ్‌ చేశారని, ఫ్యామిలీ గురించి తప్పుగా కామెంట్లు పెడుతుండటంతో ట్రోలర్స్ కు సోహైల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. `లక్కీ లక్ష్మణ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో సోహైల్ వారికి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తానేం బిగ్‌ బాస్‌ 4లో స్కామ్‌ చేయలేదని, ఆఫర్ తీసుకుని బయటికి వచ్చానని అన్నారు. తనది మధ్యతరగతి కుటుంబం అని, తనలాంటి వారికి అదొక పెద్ద అమౌంట్ అని చెప్పుకొచ్చాడు.

 

కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఆ అమౌంట్ చాాలా హెల్ప్ అయ్యిందని, ఆ డబ్బుతో తాను తన చెల్లి పెళ్లి చేశానని సోహైల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు వచ్చిన డబ్బులోనే కొంత ఓల్డేజ్‌ హోంకి కూడా సాయం చేసినట్లు సోహైల్ తెలిపాడు. ఇప్పుడు తన సినిమాను ఆదరించి సక్సెస్ ఇస్తే ఆ డబ్బులతో ఇంకొంత మందికి సాయం చేస్తానని తెలిపాడు. తన గురించి గానీ, తన ఫ్యామిలీ గురించి గానీ ట్రోల్స్ చేస్తే చూస్తూ ఊరుకోనని సోహైల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -