Sonali Phogat: విష ప్రయోగం వల్లే మరణించిందట.. నటి సోదరి ఆరోపణలు

Sonali Phogat: బీజేపీకి సంబంధించిన నేతలు మంగళవారం నాడు వార్తల్లోకి ఎక్కుతున్నారు. తెలంగాణ రాజాసింగ్, బండి సంజయ్ విషయాలు వైరల్ అవుతుంటే.. ఉత్తరాదిన సోనాలి ఫొగట్ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా స్టార్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు సోనాలి ఫోగట్ మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సోనాలి ఫోగట్ 41 సంవత్సరాల వయస్సులో గుండెపోటుకు గురై కన్నుమూశారు.

సోనాలి తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లినట్లు సమాచారం. సోనాలి ఫోగట్ తన మరణానికి కొన్ని గంటల ముందు తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమె చేసిన చివరి రీల్ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పింక్ టర్బన్ ధరించిన ఈ స్టార్ బాలీవుడ్ రెట్రో పాట ‘రుఖ్ సే జరా నఖబ్ హతా దో’లో రీల్ చేస్తూ..ఎంతో సంతోషంగా కనిపించింది.

కానీ చివరకు సోనాలి విగత జీవిగా కనిపించింది. అయితే సోనాలి మరణంపై ఆమె సోదరి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. విష ప్రయోగం వల్లే సోనాలి ఫొగట్ మరణించిందంటూ చెప్పుకొచ్చింది నటి సోదరి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత అస్వస్థత ఉందని అమ్మతో చెప్పిందట. తన మీద కుట్ర జరుగుతోందని తాను తినే ఆహారంలో ఏదో కలిపినట్టు అనుమానంగా ఉందంటూ చెప్పుకొచ్చిందట సోనాలి.

మొత్తానికి సోనాలి మరణం మాత్రం ఇప్పుడు మిస్టరీగా మారింది. హిసార్ దూరదర్శన్‌లో యాంకరింగ్‌తో తన కెరీర్‌ని ప్రారంభించారు. 2008లో బీజేపీలో చేరారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె ఎప్పుడూ చర్చల్లోనే ఉంటూ వచ్చారు. తన జీవితంలో ఎదురైన బాధలను ‘బిగ్ బాస్’ సీజన్ 14లో ప్రేక్షకులతో పంచుకున్నారు సోనాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP: ఆ సర్వేలను నమ్ముకుంటే వైసీపీ కథ కంచికే.. ఆ మాటలు నమ్మితే నిండా మునిగినట్లే?

YSRCP: ఇప్పటివరకు వచ్చిన సర్వేల ఫలితాలు రోజురోజుకీ వైసీపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అలాగే ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే జాతీయస్థాయిలో బీజేపీ ది, ఏపీలో వైసీపీ ది అధికారం...
- Advertisement -
- Advertisement -