Congress President: కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర అధ్యక్షుడు.. ఆ సీఎంకు ఛాన్స్?

Congress President: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్ట పరిస్ధితుల్లో ఉంది. ఆ పార్టీకి అధ్యక్షుల కొరత ఏర్పడింది. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షులు కరువయ్యారు. జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై హస్తం పార్టీలో డైలమా నెలకొంది. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. రాజకీయాల్లో జయపజయాలు సాధారణమని కాంగ్రెస్ పెద్దలు ఎంత సూచించినా.. రాహుల్ రాజీనామా చేసి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామా చేయవద్దని పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చినా రాహుల్ వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామాకే మొగ్గు చూపారు.

ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం వయస్సు పెరగడం, అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యల వల్ల అధ్యక్ష పదవి బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్ధితుల్లో సోనియా గాంధీ ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పర్మినెంట్ వ్యక్తిని నియమించాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఆ పదవిని భర్తీ చేసి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఆగస్టు 21 నుంచి ప్రారంభ కావాల్సి ఉంది. కానీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు సోనియా గాంధీ అసక్తి చూపకపోవడం, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఆ పార్టీలో కన్ ప్యూజన్ నెలకొంది. ఇక ప్రియాంక గాంధీకి అప్పగించాలనే డిమాండ్ ఉన్నా కొంతమంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు. యూపీ ఎన్నికల బాధ్యతలను ఆమెకు అప్పగించగా.. అక్కడ ఫెయిల్ అయ్యారు. దీంతో ఆమె నాయకత్వంపై శ్రేణుల్లో ఆశలు నిరాశగా మిగిలిపోయాయి. దీంతో అధ్యక్ష పదవి ఎన్నికపై ఆ పార్టీ అధికారికంగా ఎక్కడా స్పందించడం లేదు.

ఈ క్రమంలో ఓ వార్త ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలను గాంధీయేతర వ్యక్తికి కేటాయించనన్నారనే ప్రచారం జరుగుతోంది. సీతారం కేసరి తొలిసారి గాంధీయేతర వ్యక్తిగా 1996 నుంచి 1998 వరకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే సారధిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్లీ గాంధీ కుటుంబ నేపథ్యం లేని వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

సెప్టెంబర్ 20తో అధ్యక్ష పదవి ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఇప్పటినుంచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై ఫోకస్ పెట్టింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల సోనియా గాంధీతో ఆయన భేటీ కావడం, అధ్యక్ష పదవి ఎంపిపై చర్చించడంతో ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. తర్వాతి జాతీయ అధ్యక్షుడు ఆయనే అని కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఊపందుకుంది. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి ముకుల్ వాస్నిక్, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, మాజీ ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరం, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే పేర్లు కూడా రేసులో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వచ్చేవారం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ ఓటర్ల జాబితాను అందిస్తారు. దాదాపు 14 వేల మంది కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలో ఓట్లు వేస్తారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులను ఈ ఓటర్లు ఎన్నుకుంటారు. మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -