Soundarya: సౌందర్య రియల్ క్యారెక్టర్ బయటపెట్టిన ప్రముఖ నటుడు!

Soundarya: సినిమాల్లో చాలా సీన్లు రియల్ లైఫ్ కి చాలా భిన్నంగా ఉంటాయి. తెలుగు సినిమాలు ఒకప్పుడు ఒకలా ఉంటే, ఇప్పుడు వాటిలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మరీ సినిమాటిక్ గా ఉండకుండా, రియల్ లైఫ్ కు దగ్గరగా సినిమాలు వస్తున్నాయి. అయితే ఒకప్పుడు చాలా సినిమాల్లో రేప్ సీన్లు ఉండేవి. రేప్ సీన్లను ఆధారంగా చేసుకొని కూడా కొన్ని సినిమాలు కథలతో వచ్చేవి.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రేప్ సీన్లకు ఎంతో పేరున్న యాక్టర్ సత్యప్రకాశ్. 80లలో వచ్చిన సినిమాల్లో రేప్ సీన్లు ఎక్కువగా ఉండేవి. వాటిలో ఎక్కువ శాతం సత్యప్రకాశ్ నటించినవే ఉండేవి. అయితే సత్యప్రకాశ్ తన కెరీర్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని ఓ యూబ్యూట్ ఛానల్ లో చెప్పాడు.

‘పెళ్లి చేసుకుందాం’ సినిమాలో హీరోయిన్ సౌందర్యను రేప్ చేసే సీన్ చేసినట్లు వివరించిన నటుడు సూర్యప్రకాశ్.. ఈ సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని వివరించాడు. అయితే ఆ సీన్ గురించి హీరోయిన్ సౌందర్య.. చిరంజీవికి చెప్పిందని సూర్యప్రకాశ్ వివరించాడు.

చిరంజీవి, సౌందర్య నటించిన ‘చూడాలనివుంది’ సినిమా షూటింగ్ టైంలో.. తన గురించి చిరంజీవికి సౌందర్య చెప్పిందని సూర్యప్రకాశ్ అన్నాడు. ‘నా కెరీర్ లో ఒకే ఒక్కసారి రేప్ సీన్ చేశాను, అందులో నన్ను రేప్ చేసిన దుర్మార్గుడు ఇతనే’ అంటూ సౌందర్య తన గురించి చిరంజీవికి చెప్పినట్లు సూర్య ప్రకాశ్ తెలిపాడు. సౌందర్య ఎంతో ఫన్నీగా ఆ విషయాన్ని చెప్పిందని అతడు వివరించాడు.

 

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -