Sourav Ganguly: దాదా మీద ఫోకస్ పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం!

Sourav Ganguly: ఐపీఎల్ ఒక ప్రభంజనం. ఈ టోర్నమెంట్ పొట్టి ఫార్మెట్ ని అభిమానులకి మరింత చేరువ చేయడం మాత్రమే కాదు,రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ ఆటగాళ్ళను మళ్ళీ మైదానంలో చూసే అవకాశం కలిపిస్తుంది. సెహ్వాగ్, సచిన్ నుంచి నిన్నటి మహేంద్ర సింగ్ ధోని దాకా ఈ పంథాని అనుసరించిన వాళ్ళే. ఈ రకంగా చూసుకుంటే అభిమానులు ఐపీఎల్ కి దీన్ని నిర్వహించే నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పాలి.

 

దాదా రాబోతున్నాడు!

 

అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం లెజెండరీ ఆటగాడు మళ్ళీ ఐపీఎల్ లో అడుగుపెట్టబోతున్నటు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభం అవుతుందా మళ్ళీ ఎప్పుడు ఆటగాడిని చూస్తామా అని అనుకుంటున్నారు. మీడియా సమాచారం ప్రకారం కోల్ కత్త ప్రిన్స్ సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ గా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. గంగూలీ జట్టుని బాగా నడిపిస్తాడనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు సమాచారం. అయితే దీని మీద అధికార ప్రకటన రావాల్సి ఉంది.

 

ప్రముఖ మీడియా సంస్థలు దీని మీద వార్తలు రాస్తున్నారు. దీని సారాంశం ఏంటంటే మాజీ భారత సారధి సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గ బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. ఈ పదవిలోకి వచ్చిన తరువాత గంగూలీ జట్టు నిర్వహణ మరియూ ఇతర విషయాల మీద దృష్టి పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ.

 

ఫియర్ లెస్ ఆటకి గంగూలీ పెట్టింది పేరు. టీమిండియా కష్ట సమయంలో ఉన్నప్పుడు జట్టు సారధ్యం స్వీకరించారు గంగూలీ. మళ్ళీ భారత్ జట్టుని గాడిన పెట్టారు. సారధిగా, ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితమయ్యారు. అయితే ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడంతో ఆయన తప్పుకున్నారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం గంగూలీ మీద ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఐపీఎల్ టోర్నమెంట్ గంగూలీ క్లి కొత్త కాదు.గతంలో కోల్ కత్త నైట్ రైడర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహించడమే కాదు ఆ జట్టుని నడిపించారు కూడా.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -