Boxing Day: బాక్సింగ్ డే టెస్టులోనూ చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా

Boxing Day: ఆస్ట్రేలియా పర్యటనలో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఓడిపోయిన సఫారీలు బాక్సింగ్ డే సందర్భంగా ప్రారంభమైన రెండో టెస్టులో కూడా ఇన్నింగ్స్ ఓటమి పాలయ్యారు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 182 పరుగుల భారీ విజయాన్ని ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా జట్టు.. రెండో ఇన్నింగ్స్ లో 204 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 189 పరుగులకు ఆలౌటైంది. వీరెన్నె (52), జాన్సన్ (59) మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగాడు. అయితే ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగి ఆడింది. ఆ జట్టు తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 575/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 386 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

 

ముఖ్యంగా చాలా కాలంగా పేలవంగా ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి వచ్చాడు. 16 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 255 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. మరోవైపే వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ కేరీ (111) కూడా సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ (85), ట్రావిస్ హెడ్ (51), కామెరూన్ గ్రీన్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. రెండో ఇన్నింగ్స్‌లో అయినా దక్షిణాఫ్రికా పోరాడుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ నాలుగో రోజే మ్యాచ్ ముగిసిపోయింది.

 

బవుమా ఒంటరి పోరాటం
దక్షిణాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్‌లో బవుమా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 144 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 65 పరుగులు చేశాడు. వీరెన్నె (33), డిబ్రయిన్ (28), ఎర్వీ (21) మాత్రమే స్కోరు చేయగలిగారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ డకౌటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయోన్ మూడు వికెట్లతో చెలరేగాడు. స్కాట్ బోలాండ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డేవిడ్ వార్నర్‌కు లభించింది. తాజా గెలుపుతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానం మరింత పదిలంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -