South Stars: అక్కడ కూడా బాలీవుడ్ ను వెనకేసిన టాలీవుడ్..!

South Stars: ఒకప్పుడు టాలీవుడ్ యాక్టర్లందరూ కేవలం తెలుగులోనే.. బ్రాండ్ అంబాసిడర్ లుగా యాడ్ చేసేవారు. నిజానికి అప్పుడు టాలీవుడ్ స్టార్లకు పాన్ ఇండియా స్థాయిలో యాడ్ ఆఫర్స్ కూడా వచ్చేవి కాదు. ఇక ఇదే క్రమంలో బాలీవుడ్ కూడా.. యాడ్ ల విషయంలో నార్త్ ఇండియా వరకే యాడ్లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవారు. కొన్ని కొన్ని సార్లు నార్త్ స్టార్లు కూడా తెలుగులో కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్లుగా చేసేవారు.

కానీ ప్రస్తుతం బాలీవుడ్ యాడ్ మార్కెట్ పరంగా పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పవచ్చు. దీనికి కారణం బాలీవుడ్ లో వరుస పరాజ్యాలే. ఇదే సమయంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా.. ఒక రేంజ్ లో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. కాబట్టి యాడ్ మార్కెట్లు కూడా చాలా వరకూ సౌత్ స్టార్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం సౌత్ యాక్టర్లు ఒక ఊపు మీద ఉన్నారు కాబట్టి.. యాడ్ మార్కెట్ల కన్ను వీరిపై పడింది. ఫామ్ లో ఉన్న వారికే ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతారు.

కనుక ప్రస్తుతం అన్ని బ్రాండ్ కంపెనీలు.. సౌత్ స్టార్లతో ఒప్పందాలు కుదురుచుకుంటున్నాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇలా అందరూ.. బ్రాండ్ అంబాసిడర్ లుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా యాడ్లు చేసుకుంటూ కూడా సౌత్ ఇండియన్ యాక్టర్లు.. పాన్ ఇండియా స్టార్లుగా మారుతున్నారు. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే మహేష్ బాబు పాన్ స్థాయిలో కొన్ని యాడ్లు చేశాడు.

అనంతరం ప్రభాస్ ఫామ్ లోకి వచ్చాడు.. బాహుబలి సిరీస్ సూపర్ హిట్ అయిన తర్వాత యాడ్ మార్కెట్ నేపథ్యం లో పాన్ ఇండియా స్టార్ గా వెలిగాడు. ఇప్పుడు అల్లు అర్జున్, రష్మిక మందన్న, రామ్ చరణ్ ల వంతు వచ్చింది. ఈ ముగ్గురు స్టార్లు యాడ్ మార్కెట్ విషయంలో ఏమాత్రం తగకుండా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -