Tammineni Sitaram: మరోసారి వివాదంలో ఏపీ స్పీకర్.. అమరావతి రైతుల పాదయాత్రపై బరితెగింపు వ్యాఖ్యలు

Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం రెచ్చిపోతున్నారు. గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి పార్టీకతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ఉండాల్సి ఉంటుంది. స్పీకర్ పదవికి ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో చాలా గౌరవం ఉంది. పార్టీలన్నీ స్పీకర్ ను గౌరవిస్తాయి. అలాంటి స్పీకర్ కుర్చీలో ఉన్న వ్యక్తి సభ సాంప్రదాయాలను గౌరవిస్తూ పార్టీలను పక్కన పెట్టి అందరి పక్షాన పనిచేయాల్సి ఉంటుంది. వాస్తవ పరిస్థితులను తెలుసుకని ఏకపక్షంగా ఉండాల్సి వస్తుంది. తాను గెలిచిన పార్టీని వదలేసి స్పీకర్ గా అన్ని పార్టీలలకు, ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీలో పెద్ద మనిషిలా ఉండాల్సి ఉంటుంది.

కానీ స్పీకర్ తమ్మినేని తాను గెలిచిన అధికార వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు. సీఎం జగన్ పట్ల భక్తి భావాన్ని ప్రదర్శిస్తున్నారు. స్పీకర్ గా కాకుండా వైసీపీ నేతగానే ఆయన వ్యవహరిస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నవాళ్లు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. కానీ తమ్మినేని మాత్రం స్పీకర్ పదవికి మచ్చ తీసుకొస్తుున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నారు. వైసీపీ పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ పార్టీ లైన్ లోనే ఆయన పనిచేస్తున్నారని, వైసీపీ ఎజెండానే ఆయన ఫాలో అవుతన్నారని తీవ్ర విమర్శలపై ఆయనకు తీరని మచ్చలా మారిపోయాయి.

తాజాగా మూడు రాజధానుల వ్యవహారం, రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతోన్నాయి. రాజధాని అమరావతి అన్న వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా పొలిమేరల నుంచి వారిని తరిమికొట్టాలని స్పీకర్ పిలుపుునివ్వడం ప్రకంపనలు రేపుతోంది. విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్నిగుండం కాబోతుందని బాంబ్ పేల్చారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుున్నారంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. జగన్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని స్పీకర్ కోరారు.

అన్ని సౌకర్యాలున్న విశాఖను రాజధాని చస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని తమ్మినేని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించాలని కోరారు. విశాఖ పరిపాలన రాజధానిగా చేసేలా ఉత్తరాంధ్ర ప్రజలు రోడ్డ మీదకు వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు విశాఖకు వచ్చి జీవించేలా పరిస్థితులు ఉన్నాయని, విశాఖ పరిపాలన రాజధానిగా ఉండటానికి ఎంతో అనువుగా ఉందన్నారు. ఏపీ పునర్విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ ను కోల్పోయిందన్నారు.

అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకే జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులను తీసుకొచ్చారని తమ్మినేని అభిప్రాయపడ్డారు. అయితే రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్న క్రమంలో అమరావతే రాజధాని అని పిలిచిన వారిని తరిమికొట్టాలని తమ్మినేని చేసిన ఘాటు వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. స్పీకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా రెచ్చగొట్టేలా అమరావతి రైతుల ఉద్యమం గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే రైతులు పాదయాత్ర చేస్తున్నారని తమ్మినేని గతంలో వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులది ఉన్మాద యాత్ర అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో అమారావతి మహిళా రైతలను ఉద్దేశించి ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పుడు మరోసారి ప్రజలను రెచ్చగొట్టేలా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ బరితెగించి మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -