Mokshagna: స్టార్ హీరోలను మించి మోక్షజ్ఞ కోసం ఖర్చు చేస్తున్నారా?

Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద విపరీతమైన ప్రభావం చూపించే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన మెగా కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, మంచు కుటుంబం, నందమూరి కుటుంబం ఈ జాబితాలోకి వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ కుటుంబాలకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండగా.. ఈ కుటుంబాలకు చెందిన ఎవరైనా హీరో, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే.. వేరే లెవల్ లో అంచనాలు ఉంటాయి.

టాలీవుడ్ ని ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కుటుంబాల జాబితాలో నందమూరి కుటుంబం ఎంతో ప్రత్యేకం. ఈ కుటుంబానికి చెందిన రెండో తరంలో నందమూరి బాలయ్య.. సినిమాలతో తన హవాను ఇంకా కొనసాగిస్తున్నాడు. అదే సమయంలో మూడో తరానికి చెందిన తారక్, కళ్యాణ్ రామ్ లు కూడా మంచి సినిమాలతో టాప్ లో తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా నందమూరి కుటుంబం నుండి మరో హీరో ఎంట్రీ ఖరారైంది.

నందమూరి బాలయ్య కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఈ ఏడాది తెర మీదకు అరంగేట్రం చేయబోతున్నట్లు ఖరారైంది. ఎంతో కాలంగా నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే చర్చ నడిచినా.. ఈ ఏడాది మాత్రం అది ఖచ్చితం అని తేలింది. ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ సినిమా గురించి నందమూరి బాలయ్య పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. కథ దగ్గరి నుండి ప్రతి విషయంలో ఆయన ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఏమాత్రం తగ్గకుండా ఉండాలని.. ఖర్చు విషయంలో బాలయ్య వెనక్కి తగ్గనివ్వట్లేదని సమాచారం. నందమూరి మోక్షజ్ఞ సినిమా కోసం ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ ను కేటాయించేలా చేశారని తెలుస్తోంది. మొదటి సినిమాతోనే భారీ లెవల్ బడ్జెట్ తో రాబోతున్న నందమూరి మోక్షజ్ఞ వేరే లెవల్ ఎక్స్ పీరియన్స్ ని అభిమానులకు అందించడానికే ఇంతలా ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మోక్షజ్ఞ సినిమా భారీ లెవల్ లో ఉండబోతుండగా.. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts