Sree Leela: హీరోయిన్ శ్రీలీలకు ఇంత బలుపా.. అలా చేస్తోందా?

Sree Leela: సూపర్‌ హిట్ మూవీ పెళ్లిసందడి సీక్వెల్‌ పెళ్లి సందD తో తెలుగు చిత్రసీమలోకి రంగ ప్రవేశం చేసిన యువ నటి శ్రీలీల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్ తో కుర్రకారు ను ఓ రేంజ్ లో ఉర్రూతలూగించింది. ఫస్ట్ మూవీ తోనే శ్రీలీల బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఆమె వయసు చాలా చిన్నది కాబట్టి ప్రేక్షకులకు బాగా నచ్చింది అని చెప్పొచ్చు.

పైగా శ్రీలీల తన అద్భుతమైన డాన్స్ తో ఫ్యాన్స్‌ని మెస్మరైజ్‌ చేసేసింది. ఎటువంటి ఎక్స్ప్రెషన్ అయినా ఈజీగా కళ్ళతో అభినయించే కళ శ్రీలీల సొంతం. ఇప్పటి వరకు ఆమె నటించిన ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అయింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఇప్పటికే ఆమె చేతిలో ఆరు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలోనే రవితేజ జతనా శ్రీలీల నటిస్తున్న ధమాకా మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

అలాగే మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న SSMB 28 మూవీ లో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కి శ్రీలీల ను సెలెక్ట్ చేసినట్లు సమచారం.అనిల్ రావిపూడి -బాలకృష్ణ ,ఎన్.బి.కె 108 మూవీ లో శ్రీలీల నటిస్తోంది. ఇలా అగ్ర హీరోల సరసన వరుసగా మూవీస్ తో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఊహించని విధంగా ఒకేసారి నీ ప్రాజెక్ట్ చేతికి రావడంతో శ్రీలీల షెడ్యూల్ చాలా టైట్ గా మారింది. ఈ క్రమంలో ఇంకో స్టార్ హీరో అవకాశం ఇవ్వడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ కాక ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన మరొక స్టార్ హీరో చిత్రం నుంచి తప్పుకోవాలి అని శ్రీలీల సిద్ధపడిందట. కానీ అసలు విషయం చెప్పకుండా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ మూవీ చేయలేకపోతున్నాను అని డైరెక్టర్ కి చెప్పిందట. డైరెక్టర్ హీరోకి అసలు విషయం చెప్పడంతో ఆ హీరో నేరుగా శ్రీలీల కు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడట.

ఇండస్ట్రీలో ఎదగాలి అంటే పద్ధతిగా నడుచుకోవడం తెలియాలి. యాక్టింగ్ ఒకటే వస్తే సరిపోదు మాట మీద నిలబడే తీరు కూడా తెలిసి ఉండాలి. మూవీ కాంట్రాక్ట్ సైన్ అయింది కాబట్టి ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆ హీరో అన్నాడట. కాదు అంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందని కూడా బెదిరించాడట. ఇకనైనా శ్రీలీల తను తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్త వహించడం మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: కాంగ్రెస్ గెలుపు అక్కర్లేదు.. వైసీపీ ఓడితే చాలు.. షర్మిల ప్లాన్ సక్సెస్ అవుతుందా?

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి ఆదరణ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పై ఏపీ ప్రజలకు పీకల వరకు కోపం...
- Advertisement -
- Advertisement -