Sreeja: ఆ వ్యక్తినే శ్రీజ పెళ్లి చేసుకోబోతున్నార్?

Sreeja: తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన ఫ్యామిలీ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు అయిన శ్రీజ కొణిదెల తన భర్త కళ్యాణ్ దేవ్ నుండి విడిపోయినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇది ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారమే అయినా ఇటీవలే అవి నిజమేనని వార్తలొస్తుండటం గమనార్హం.

గత ఏడాది జనవరి నుంచి విడివిడిగా ఉంటున్నట్లు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీజ, కళ్యాణ్ లు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. శ్రీజ అయితే తన జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడని కామెంట్స్ చేయడం విశేషం. కొత్త సంవత్సరం సందర్భంగా గత ఏడాదిలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ను శ్రీజ షేర్ చేశారు.

డియర్ 2022 అని మొదలుపెట్టి, తన జీవితంలోకి అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసావని, తన గురించి బాగా తెలిసిన వ్యక్తి, తనను అమితంగా ప్రేమిస్తూ కేరింగ్ గా చూసుకుంటూ కష్టసుఖాలలో తనకు తోడుండే వ్యక్తిని, ఎప్పుడు తనకు సపోర్టుగా నిలబడే వ్యక్తిని కలుసుకోవడం అద్భుతంగా ఉందని ఆమె పోస్టు చేసింది. ఇకపోతే తన కొత్త ప్రయాణం మొదలవుతుందంటూ ఆమె ఆసక్తికర పోస్టును షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.

శ్రీజ రెండు సార్లు విడాకులు తీసుకుని ఇప్పుడు తన ఇద్దరు కూతుళ్లను చూసుకుంటోంది. మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని బయటికి చెప్పుకున్నా శ్రీజ గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ దేవ్ కి విడాకులు సైతం ఇచ్చేసినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. కళ్యాణ్ దేవ్ వ్యవహారంతో శ్రీజ అడ్జస్ట్ కాలేకపోయిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -