Sreeja Konidela: మూడో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన శ్రీజ.. అలా చెప్పడంతో?

Sreeja Konidela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్న కుటుంబం మెగా కుటుంబం. మెగాస్టార్ చిరంజీవి కష్టపడి తెలుగు సినిమా రంగంలో తమ కుటుంబం పేరును చిరస్థాయిలో నిలిచేలా ప్రయత్నించాడు. అయితే చిరంజీవి సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఎంతోమందికి ఆసక్తిగా ఉంటుంది. అందుకే ఈయన కుమార్తెలు, కొడుకు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు.

 

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి చాలాసార్లు వార్తలు వచ్చి ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో మెగాస్టార్ కూతురు శ్రీజ.. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వార్తల్లో నిలిచింది. మెగా కుటుంబానికి కొన్ని సంవత్సరాల పాటు దూరంగా ఉన్న శ్రీజ.. తనకు కూతురు పుట్టిన మూడేళ్లకు తన భర్తను వదిలేసి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరింది.

 

మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన భార్య సురేఖలు శ్రీజకు మరో పెళ్లి చేయాలని చిత్తూరుకు చెందిన కళ్యాణ్ దేవ్ తో పెళ్లి కుదిర్చారు. వీరిద్దరికి మరో ఆడబిడ్డ పుట్టింది. కళ్యాణ్ దేవ్ మెగా కుటుంబం అండతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ తర్వాత మాత్రం ఎక్కడా కనిపించకుండా పోయాడు. అయితే ప్రస్తుతం శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల మధ్య దూరం పెరిగిందని.. శ్రీజ వద్దే పిల్లలు ఉంటున్నారని.. వాళ్ల బాగోగులను ఆమెనే చూసుకుంటోందనే టాక్ నడుస్తోంది.

 

కళ్యాణ్ దేవ్ తో శ్రీజ విడిపోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా పెట్టిన పోస్ట్ ఒకటి ఆమె.. మూడో పెళ్లికి సిద్ధమైపోయిందా అనే అనుమానాలకు తావిస్తోంది. ‘డియ‌ర్ 2022 నా జీవితంలో అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తిని క‌లిసేలా చేశావ్‌.. నా గురించి బాగా తెలిసిన వ్య‌క్తి… న‌న్ను అమితంగా ప్రేమిస్తూ.. కేరింగ్‌గా చూసుకునేవాడు.. క‌ష్ట సుఖాల్లో నాకు తోడు ఉండ‌డంతో పాటు.. నాకు ఎప్పుడూ స‌పోర్టింగ్‌గా ఉండేవాడు.. త‌న‌ను క‌ల‌వ‌డం అద్భుతం.. కొత్త ప్ర‌యాణం మొదలు కాబోతోంది’ అని శ్రీజ పోస్ట్ చేయడంతో త్వరలోనే మూడో పెళ్లికి ఆమె సిద్ధమైందనే చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -