Sri Reddy: శ్రీరెడ్డిపై నెటిజన్ల బోల్డ్ కామెంట్స్.. సంతృప్తి రాదా అంటూ?

Sri Reddy: సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ‘శ్రీరెడ్డి’ పేరు వినిపిస్తుంటుంది. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అయింది ఈ భామ. సినీ ఇండస్ట్రీలో నటులు, దర్శకులు, టెక్నీషియన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. బాగా క్రేజ్ సంపాదించుకుంది. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, అవకాశాల పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారని ఆరోపించింది. నోటికి వచ్చినట్లు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఫేమస్ అయింది.

 

 

టీవీ యాంకర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఈ భామ.. అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. ‘నేను నాన్న అబద్ధం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. దాంతో అవకాశాల కోసం రెండేళ్లు ఆగింది. ఆ తర్వాత ‘అరవింద్-2’ సినిమాలో నటించింది. ఈ సినిమాతో శ్రీరెడ్డికి మంచి పేరు వచ్చింది. కానీ రాను రాను ఆమెకు అవకాశాలు రావడం తగ్గాయి. అయితే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఆమె బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అప్పటి నుంచి హీరోలు, డైరెక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ వైసీపీ పార్టీకి మద్దతుదారుగా కొనసాగుతోంది. అయితే ఇండస్ట్రీ ఆమెను వ్యతిరేకించడంతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టుకుంది. అందులోనే తన వాయిస్‌ను అందించడం, జనాలను ఎంటర్‌టైన్ చేసే వీడియోలు అప్లోడ్ చేస్తోంది. ఈ క్రమంలో వంటల ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ.. తన వంటలను రుచి చూపిస్తోంది.

 

 

తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను అప్లోడ్ చేసింది. ఇందులో సంసార సంబంధమైన విషయాల గురించి చెప్పుకొచ్చింది. మగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పైకి మొరటుగా కనిపించే మగాళ్లు.. అసలు మగాళ్లే కాదని తేల్చి చెప్పింది. అలాగే బిల్డప్ చూపించుకునే హీరోలకు కూడా అంత సీన్ లేదని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ‘పడక గదిలో ఎంతటి మగాడైనా.. హీరోలైనా జీరోలే.’ అని బరితెగింపు మాటలు మాట్లాడింది. ప్రస్తుతం ఆమె చేసిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దానికి నెటిజన్లు కూడా ‘నీకు ఎంత మంది వచ్చినా సరిపోరు.’ అని కౌంటర్ ఇస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -