Sri Reddy: తీసేదేమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. బాబు డేట్స్ కావాలా అధ్యక్ష: శ్రీ రెడ్డి

Sri Reddy: ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా అంటే సినిమాలో కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాలంటే అందరికీ ఓ అభిప్రాయం ఏర్పడింది. సినిమాలో కంటెంట్ లేకపోయినా సినిమాని ఓవర్ హైప్ చేస్తూ చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం పూరి నైజం అయింది.ఇలా గత కొంతకాలం నుంచి పూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి.

ఇకపోతే తాజాగా ఈయన మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ఎదుర్కొంది. ఇక ఈ సినిమా చూసిన విజయ్ దేవరకొండ అభిమానులు కూడా సినిమా విషయంలో కాంప్రమైజ్ కాలేకపోతున్నారు.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచి డిజాస్టర్ టాక్ ఎదుర్కోవడంతో ఈ సినిమాపై ఎంతో మంది స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ లేకపోయినా విజయ్ దేవరకొండ భారీగా యాటిట్యూడ్ చూపించారని కంటెంట్ ఉన్నప్పుడే యాటిట్యూడ్ చూపించిన ఓ అర్థం ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లో విజయ్ దేవరకొండ పై కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా ఫలితం పై శ్రీ రెడ్డి కూడా స్పందిస్తూ తనదైన శైలిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై కామెంట్ చేశారు.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… తీసేవన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. మరల మహేష్ బాబు డేట్స్ కావాలట..ఇలాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలకు మహేష్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని ఆయన పై ఏడ్వడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష అంటూ శ్రీ రెడ్డి కామెంట్ చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సినిమా గురించి భారీ హైప్ చేసిన విషయంపై కూడా శ్రీ రెడ్డి స్పందించారు. లైగర్ కి ముందు లైగర్ తర్వాత అంట.. కంటెంట్ ఉన్నోడికి హైప్ అవసరం లేదు. కంటెంట్ లేనప్పుడు మనకి ఇలాంటి హైప్ అవసరమా.. లైగర్ సినిమా కన్నా కార్తికేయ 2సినిమా చాలా బెటర్ గా ఉన్నట్టు ఈ సందర్భంగా శ్రీరెడ్డి ఈ సినిమా ఫలితం పై స్పందించి తనదైన శైలిలో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Ambati Rambabu: చెత్తకుప్పల్లోకి చేరిన వైసీపీ టీ కప్పులు.. ప్రచారం వికటిస్తోందిగా జగన్?

Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది...
- Advertisement -
- Advertisement -