Sri Satya: హీరో రామ్ కు ప్రపోజ్ చేసిన శ్రీ సత్య.. చివరికి ఏం జరిగిందంటే?

Sri Satya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ శ్రీ సత్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ విజయవాడలో స్టడీస్ మొత్తం పూర్తిచేసి, ఆ తర్వాత మిస్ విజయవాడ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇక మిస్ ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ ను సొంతం చేసుకునేసరికి సత్య కు సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా సత్య రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది.

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మకు వరుసగా సీరియల్ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా బిగ్ బాస్ హౌస్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు సత్య ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నాకు హీరో రామ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. నాకు దేవదాసు సినిమా నుంచి రామ్ అంటే ఇష్టమని తెలిపింది.

ఒకరోజు సత్యకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే.. ఆ రక్తాన్ని వృధా చేయకూడదని పేపర్స్ మీద తనకు ఇష్టమైన రామ్ పేరును రాసుకుందట. ఒకరోజు సత్య వాళ్ళ అమ్మ బీరువా సర్దేటప్పుడు ఈ పేపర్లు కనిపించాయట. దాంతో సత్య వాళ్ళ అమ్మ బాగా తిట్టిందట. అలాగే రామ్ విషయంలో తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా శ్రీ సత్య బయట పెట్టింది. ఇండస్ట్రీలో సత్యకు బాగా తెలిసిన ఒక అన్నయ్య కు రాఖీ కట్టిందట. దానికి గిఫ్ట్ గా ఆ అన్నయ్య హీరో రామ్ పోతినేని నెంబర్ ఇచ్చాడట.

ట్రూ కాలర్ లో చెక్ చేసుకుంటే అది రామ్ ఒరిజినల్ నెంబర్ అని తెలిసిందట. దాంతో ఆ నెంబర్ కి శ్రీ సత్య ఐ లవ్ యు అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ రామ్ చూసినట్లు బ్లూ టిక్స్ కూడా పడ్డాయట. కానీ రామ్ పోతినేని ఆ మెసేజ్ కు రియాక్ట్ అవ్వకుండా ఆ నెంబర్ బ్లాక్ చేసాడట. ఈ విషయాన్ని శ్రీ సత్య ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

Gannavaram: గన్నవరం నియోజకవర్గంలో గెలుపెవరిది.. వల్లభనేని వంశీ హ్యాట్రిక్ సాధిస్తారా?

Gannavaram: ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్ దాఖలు చేశారు. ఇకపోతే ఏపీ రాజకీయాలలో కృష్ణ జిల్లాలలో గన్నవరం నియోజకవర్గం కూడా ఎంతో కీలకంగా...
- Advertisement -
- Advertisement -