Undavalli Sridevi: ఆ ఒక్క తప్పుతో శ్రీదేవి, మేకపాటి సులువుగా దొరికిపోయారా?

Undavalli Sridevi: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో భాగంగా జరిగినటువంటి ఎన్నికలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి వైసిపి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పార్టీ ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది.ఈ క్రమంలోనే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆనం ఆదినారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేలపై వైసిపి పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ విధంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో ఈ నలుగురు మీడియా ముందుకు వస్తూ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉండవల్లి శ్రీదేవి మేకపాటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేము క్రాస్ ఓటింగ్ చేసాము అంటూ మాపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు మేము ఓటు వేయడం ఎవరైనా చూశారా…. పోలింగ్ బూత్ లోకి సీసీ కెమెరాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

 

ఇలా క్రాస్ ఓటింగ్ వేసామని మీకు ఎలా తెలుసు అంటూ వీరు మాట్లాడటంతో వీరు చేసే వ్యాఖ్యల వల్లే వీరు క్రాస్ ఓటింగ్ వేశారని అర్థమవుతుంది అంటూ వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీరి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నారు. ఇలా ఈ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి భారీగా అమ్ముడుపోయారని ఒక ఓటుకు సుమారు 10 నుంచి 15 కోట్ల వరకు డబ్బులు ఆశ చూపించడంతోనే ఇలా క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని తెలుస్తోంది.

 

ఇక ప్రజలలో ఈ నలుగురు ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఈ నలుగురికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జగన్ వెల్లడించడంతోనే ఇలా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారు అంటూ పలువురు వైసిపి పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఆరోపిస్తున్నటువంటి వీరికి పలువురు సవాల్ విసిరుతున్నారు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. అయితే ప్రస్తుతం ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -