Sridevi: శ్రీదేవి చెల్లికి ఆ నటుడికి మధ్య అలాంటి రిలేషన్ ఉందా?

Sridevi: అందానికి ట్రేడ్ మార్క్ గా టాలీవుడ్ లో నిలిచిన గ్లామరస్ హీరోయిన్స్ లో శ్రీదేవి ఒక్కరు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటు తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ లాంటి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించిన నటి శ్రీదేవి. బాలనాటిగా తన సినీ కెరియర్ ను ప్రారంభించిన శ్రీదేవి మేటి తారగా సినీ ఇండస్ట్రీ లో వెలిగింది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉంది.

శ్రీదేవి అడుగుజాడలను అనుసరిస్తూ ఆమె కజిన్ మహేశ్వరి కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి లాగా స్టార్ హీరోయిన్ కాలేకపోయినప్పటికీ తన అభినయంతో మహేశ్వరి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమ్మాయి కాపురంతో మూవీ కెరీర్ ను ప్రారంభించిన మహేశ్వరికి గులాబీ మూవీ తో హీరోయిన్ గా మంచి క్రేజ్ వచ్చింది.

దెయ్యం,జాబిల‌మ్మ పెళ్లి, నీకోసం,న‌వ్వులాట‌, మా అన్న‌య్య లాంటి పలు చిత్రాలలో ఆమె నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు కన్నడంలో కూడా యాక్టర్ గా మహేశ్వరికి మంచి గుర్తింపు ఉంది.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న మహేశ్వరి అక్కడితో తన సినీ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టింది.

ఇదిలా ఉండగా మహేశ్వరి ఓ హీరోతో ప్రేమాయణం సాగించింది అని అప్పట్లో బాగానే పుకార్లు ఉండేవి. ఆ హీరో ఎవరో కాదు మహేశ్వరితో పలు చిత్రాలలో కలిసి నటించి నాగుల‌పాటి శ్రీనివాస చ‌క్ర‌వ‌ర్తి ( జేడీ చ‌క్ర‌వ‌ర్తి). గులాబీ మూవీలో హిట్ పెయిర్ గా నిలిచిన వీళ్ళిద్దరూ ఆ తరువాత క్రమంగా ప్రేమలో పడ్డారు అని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది.మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఆమె జయ కృష్ణ ను పెళ్లి చేసుకున్న తరువాత క్రమంగా ఈ వార్తలు మరుగున పడ్డాయి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -