Srihan-Siri: శ్రీహాన్ సిరి కొడుకు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Srihan-Siri: బిగ్‌ బాస్‌ సీజన్-6 ఇంట్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. బిగ్‌ బాస్‌ ఇంట్లోకి సభ్యులు వెళ్లి సుమారు 3నెలలు గడుస్తుంది. అయితే కొంతమంది సభ్యులు ఎలిమినేషన్‌తో బయటకు వెళ్లగా ఇంట్లో ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్నారు.. బిగ్‌ బాస్ ఇంట్లో వచ్చి చాలా వారాలు కావడంతో వారికి ఇంటిపై బెంగ పట్టుకుంది. దీంతో బిగ్‌ బాస్ ఇంటి సభ్యలను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఈ వారం బిగ్ బాస్‌ ఫ్యామిలీ వీక్‌ నడుస్తోంది. అయితే శ్రీహార్ను కలిసేందుకు అతని ప్రేయసి సిరి వచ్చారు. ఆమె తో పాటే 3 ఏళ్ల బాలుడు కూడా వచ్చాడు. ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది. ఆ బాలుడు శ్రీహాన్ను డీడీ అని, సిరిని మమ్మీ అని పిలుస్తుండటంతో ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు తలెత్తాయి.

 

శ్రీహాన్ కోసం వచ్చిన సిరి.. బిగ్‌ బాస్ హౌస్‌లోనే శ్రీహాన్‌కు ముద్దుల వర్షం కురిపించింది. వీరి హౌస్‌లో వీరిద్దరు కాసేపు రొమాన్స్‌లో మునిగితేలారు. సిరి తన వీపుపై శ్రీహాన్ పేరుతో వేయించుకున్న టాటూని శ్రీహాన్‌ చూపించి ఆశ్చర్య పరిచింది. కాసేపటికి మూడేళ్ల బాలుడు డాడీ అంటూ శ్రీహాన్‌ చెంతకు చేరాడు. సిరిని మమ్మీ అని పిలుస్తున్నాడు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.. ఈ బుల్లబ్బాయి ఎవరు..? సిరి, శ్రీహాన్‌ను మమ్మీ, డీడీ అని పిలవడం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు.

 

సిరికి మేనమామ కొడుకు
అయితే ఈ బాలుడి గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరి బిగ్‌ బాస్‌ సీజన్‌-5లో ఉన్నప్పుడే ఈ విషయం చెప్పింది. తనకు పుట్టకపోయినా కన్న కొడుకు కంటే ఎక్కువైన బాలుడు తనకు ఉన్నాడని, తన మేనమామ కొడుకును దత్తత తీసుకున్నానని చెప్పింది.

 

సిరి తల్లి శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూలో బాలుడి గురించి చెప్పింది. ఆ బాలుడు తన తమ్ముడి కొడుకు అని.. సిరి వద్దే ఉంటాడని.. శ్రీహాన్‌ కూడా బాబును బాగా చూసుకోవడంతో తల్లిదండ్రులుగా భావిస్తున్నాడని కుండబద్దలు కొట్టింది. ఇక బిగ్‌ బాస్ ఇంట్లో ఆ బాలుడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలుడి పనులకు ఇంటి సభ్యులే కాకుండా ప్రేక్షకులు కూడా పిదా అయ్యారు. హౌస్‌లో శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లను బాలుడు ఇమిటేట్‌ చేసి అలరించాడు. సిరి కూడా బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో పిచ్చాపాటిగా మాట్లాడింది. తన ప్రియుడితో కలిసిపోతున్న శ్రీ సత్యను మందలించింది కూడా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -