Srikanth: శ్రీకాంత్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అనితా చౌదరి!

Srikanth: హీరోలు మాస్ సినిమాలతో దుమ్ము దులుపుతున్న రోజుల్లో హీరో శ్రీకాంత్‌ ఫ్యామిలీ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన పెద్ద హీరో కాకపోవచ్చు కానీ అప్పట్లో ఆయన కూడా ఒక స్టార్ హీరో. చిన్న క్యారెక్టర్లతో మొదలైన శ్రీకాంత్ ప్రస్థానం నెగటివ్ రోల్స్ తరువాత హీరోగా సాగింది. శ్రీకాంత్ ఖాతాలో చాలా హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ లో శ్రీకాంత్ కి ఉండే క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు.

 

హీరో శ్రీకాంత్ పై నటి కామెంట్స్ వైరల్!

ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా శ్రీకాంత్ స్టార్ హీరో అయ్యారు. ప్రస్తుతం ఆయన మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. అలాంటి శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ ఒక నటి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీకాంత్ గురించి మాట్లాడారు.

 

నటి అనిత చౌదరి ఒక ఇంటర్వ్యూ లో తన ప్రేమ,పెళ్ళి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భర్త కృష్ణ చైతన్య గురించి మాట్లాడుతూ,తనని ప్రేమించిన విషయం ముందు తనకి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ తో పంచుకున్నారని,ఆయన కజిన్ శ్రీకాంత్ తనకి ఫోన్ చేసి కృష్ణ చైతన్య గురించి మాట్లాడారని,పెళ్ళి కోసమే అమెరికా నుంచి వచ్చారని చెప్పాడట.

 

ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయం మొదట వారికి చెప్పడం సహజం. అయితే దీనికి విరుధ్ధంగా కృష్ణ ప్రసాద్ ముందు తన ఫ్యామిలీకి చెప్పడం అనిత కి నచ్చలేదు. మొదట్లో కొద్దిగా కోపం అనిపించినా ఆయన ప్రపోజల్ కి వప్పుకున్నారట. ప్రస్తుతం ఈమె కామెంట్స్ వైరల్ గా మారాయి. అనిత చౌదరి తెలుగులో ప్రముఖ నటుల్లో ఒకరు. ఈమె ప్రస్థానం బుల్లితెరతో మొదలై వెండితెర దాకా సాగింది. రాజమౌళి ఛత్రపతి చిత్రంలో ఈమె పాత్ర మంచి గుర్తింపు సాధించింది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -