Srikanth: ఊహ లావు అయ్యిందనే శ్రీకాంత్ విడాకులు ఇస్తున్నాడా?

Srikanth: ఇటీవల టాలీవుడ్‌లో సెలబ్రెటీల విడాకుల వార్తలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. సమంత-నాగచైతన్య విడాకులు తీసుకోగా.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో భర్త కల్యాణ్ దేవ్‌తో విడాకులు తీసుకోనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. శ్రీజ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కల్యాణ్ దేవ్ పేరును తొలగించింది. శ్రీజ కల్యాణ్‌గా ఉన్న అకౌంట్ పేరును శ్రీజ కొణిదెలగా మార్చుకుంది. దీంతో కల్యాణ్ దేవ్-శ్రీజల విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్-ఊహా విడాకుల వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ విడిపోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని, ఆర్ధిక విషయాల్లో గొడవలు వచ్చాయని చెబుతున్నారు. ఈ గొడవలు పెద్దవై విడాకుల వరకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్-ఊహాలది లవ్ మ్యారేజ్. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట నిజంగానే విడిపోతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

విడాకులకు అసలు కారణం అదేనా?

ఈ క్రమంలో ఇప్పుడు శ్రీకాంత్-ఊహా విడాకులకు సంబంధించి మరో కారణం వినిపిస్తోంది. ఊహా పెళ్లప్పటితో పోలిస్తే ఇప్పుడు బాగా లావు అయ్యారు. లావు అయ్యిందనే కారణంతోనే శ్రీకాంత్ ఊహాకు విడాకులు ఇస్తున్నాడనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. లావు ఎక్కువై అందంగా లేదనే కారణంతో శ్రీకాంత్ విడాకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే పెళ్లి సమయంలోనే ఊహా లావుగా ఉందని, అప్పుడు నచ్చే శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు లావుగా ఉందని విడాకులు ఎలా ఇస్తాడని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రేమ జంట కలిసి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వార్తలు నిజం కాకపోతే బాగుండు అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇంత జోరుగా ప్రచారం జరుగుతున్నా శ్రీకాంత్ ఇప్పటివరకు స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts