Srikanth-Ooha: నా గురించి నా భార్య గురించి తప్పుగా రాస్తారా?

Srikanth-Ooha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సాధించిన హీరో శ్రీకాంత్. లేడీ ఫాలోయింగ్ ఎక్కువ కలిగిన శ్రీకాంత్.. తనతో కలిసి నటించిన ఊహను ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కాగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, త్వరలోనే వీరిద్దరు విడిపోతారని, విడాకులకు అంతా సిద్ధమైందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

ఇలా వచ్చిన వార్తల మీద హీరో శ్రీకాంత్ స్పందించాడు. ఇవన్నీ తప్పుడు కథనాలు అని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరు క్రియేట్ చేస్తున్నారని మండిపడిన శ్రీకాంత్.. గతంలో తాను చనిపోయినట్లు పుకార్లు పుట్టించి, తన కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని గతంలో జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు.

 

ఇప్పుడు తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని శ్రీకాంత్ మండిపడ్డారు. కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయగా.. ఆమె ఖంగారుగా తనకు వాటిని చూపించిందని శ్రీకాంత్ వివరించారు. ఇలాంటివి నమ్మవద్దని, ఏమాత్రం ఆందోళన చెందవద్దు అని ఊహను ఓదార్చినట్లు శ్రీకాంత్ చెప్పాడు.

 

కొన్ని చిల్లర వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ చేసిన ఈ పనిని సోషల్ మీడియాలో చూసి బంధు మిత్రులు ఫోన్లు చేసి అడుగుతున్నారని.. అదో పెద్ద న్యూసెన్స్ అయిందని శ్రీకాంత్ వివరించాడు. తాను, ఊహ అరుణాచలంకి దైవ దర్శనానికి వెళుతున్నామని.. ఇలాంటి తరుణంలో ఈ పుకార్లు చిరాకు పుట్టిస్తున్నాయని అన్నాడు. ఇవి వ్యాపించకుండా ఉండటం కోసం స్పష్టతనిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నట్లు శ్రీకాంత్ వివరించాడు.

 

ఇక తన మీద ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్, కథనాలు పబ్లిష్ చేసిన వెబ్ సైట్ల మీద కూడా శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. ‘నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -