Srikanth: రోజాపై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Srikanth: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో శ్రీకాంత్. రొమాంటిక్, ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ చాలా హిట్స్ అందుకున్నాడు. ఒకానొక దశలో టాలీవుడ్ లో కుటుంబ కథా చిత్రాలు అంటే శ్రీకాంత్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. అంతలా పాపులర్ అయ్యాడు శ్రీకాంత్. అప్పట్లో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన శ్రీకాంత్ కు ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు ఆ రోజుల్లో అందరు హీరోయిన్లతో సినిమాలు తీసిన శ్రీకాంత్.. రోజాతో చాలా సినిమాలే చేసాడు.

 

సూపర్ హిట్ కాంబో రోజా – శ్రీకాంత్:
అప్పట్లో రోజా – శ్రీకాంత్ కాంబోకు సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరుంది. వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ అభిమానులను అలరించేది. రోజా శ్రీకాంత్ కలిసి “క్షేమంగా వెళ్లి లాభంగా రండి”, “తిరుమల, తిరుపతి వెంకటేశా”, “ఘటోత్కచుడు” మొదలైన సినిమాలు మంచి పేరుతో పెద్ద హిట్టయ్యాయి. అయితే అప్పట్లో రోజా శ్రీకాంత్‌ను ఎప్పుడూ అన్నయ్య అని పిలిచేదంట. బయట మాత్రమే కాకుండా సెట్‌ లో కూడా అలాగే పిలిచేదంట. అయితే రొమాంటిక్ సీన్స్ చేస్తూ ఇలా అన్నయ్య అని పిలవడం శ్రీకాంత్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడట.

 

ఒకసారి అన్నయ్య పిలవడంతో శ్రీకాంత్‌కు కోపానికి గురి అయ్యి, రోజా మొహంపై చెప్పేశాడట. అన్నయ్యా అని పిలిస్తే కోపం దేనికి? అని కొందరు అనుకోవచ్చు. కానీ శ్రీకాంత్‌తో రోజా చేసే రొమాంటిక్‌ సీన్లు మామూలుగా ఉండవు. అప్పట్లో వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు మంచి పేరు ఉండేది. అయితే అలాంటి రొమాంటిక్‌ సినిమా చేస్తున్నప్పుడు, రొమాంటిక్ సీన్లలో నటిస్తున్నప్పుడు కూడా రోజా అన్నయ్యా.. అన్నయ్యా.. అంటూ శ్రీకాంత్ ని పిలుస్తూ ఉండేదట.

 

అలా ఒక సందర్భంలో రోజా అన్నయ్య అని పిలవగా.. “ఎహే అలా పిలవకు రొమాంటిక్ సీన్ లో నాకు చిరాకుగా ఉంది” అని ముఖం మీదే అనేశాడంట శ్రీకాంత్. అప్పట్లో జరిగిన ఈ విషయాలన్నీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టాడు శ్రీకాంత్‌. ప్రస్తుతం శ్రీకాంత్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేయడం తగ్గించేశాడు. ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్ ఈ విషయాలు బయట పెట్టడంతో అభిమానులు అప్పటి రోజులను, శ్రీకాంత్ సినిమాలను గుర్తుకు చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -