Srimukhi: అతని జ్ఞాపకాలు మరవలేక శ్రీముఖి పెళ్లికి దూరంగా ఉన్నారా?

Srimukhi: తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ శ్రీముఖి పేరు ఎంతో ఫేమస్. బుల్లితెర స్టార్ యాంకర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. యాంకరింగ్‌తోపాటు నటనతోనూ అందరి మన్నన పొందుతోంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అదుర్స్ అనే షో ద్వారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం పలు ఛానెళ్లలో ప్రసారమయ్యే షోలకు యాంకరింగ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. చిన్న యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా.. ఇప్పుడు స్టార్ యాంకర్‌ అయిపోయింది. ప్రస్తుతం సుమ కంటే శ్రీముఖి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీముఖి.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కొద్ది నెలలుగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి వయసు ఇప్పుడు 30 ఏళ్లు దాటింది. అయినా పెళ్లి చేసుకోవట్లేదు. అయితే శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది.

 

 

గతంలో శ్రీముఖి ఓ అబ్బాయిని ప్రేమించింది. కాలేజీ డేస్‌లో ఇద్దరూ చెట్టాబుట్టలేసుకుని తిరగేశారట. పీకల్లోతూ ప్రేమలో పడిన తర్వాత శ్రీముఖికి అతడి అసలు రంగు బయట పడింది. దాంతో అతడితో బ్రేకప్ చేసి.. కొన్నేళ్లపాటు దూరంగా ఉంది. కానీ అతను మాత్రం శ్రీముఖి వదల్లేదు. రోజూ మెసేజ్‌లు, ఫోన్లు చేసి వేధించేవాడట. దాంతో చేసేదేమి లేక శ్రీముఖి తన కాంటాక్ట్స్ మొత్తం బ్లాక్ చేసుకుందట. అది గ్రహించిన ఆ అబ్బాయి.. మరింతగా రెచ్చిపోయాడు. శ్రీముఖికి బ్యాడ్ మెసేజ్‌లు పంపడం, అలాగే ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు, వీడియోలు పంపడం మొదలు పెట్టాడు. దాంతో శ్రీముఖి మరింతగా డిప్రెషన్‌కు లోనయ్యింది. పెళ్లి చేసుకోవాలని రోజూ టార్చర్ పెట్టేవాడట. దాంతో భయపడిన శ్రీముఖి డిప్రెషన్‌కు గురైంది. ఆ టార్చర్ భరించలేకే.. పెళ్లికి దూరంగా ఉంటోందని ప్రచారం. డిప్రెషన్ నుంచి బయటికొచ్చిన శ్రీముఖి కెరీర్‌ వైపు ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ యాంకర్‌గా కొనసాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: టీడీపీ కంచుకోటల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమిస్తున్న జగన్.. ఇది వృథా ప్రయాస అంటూ?

YS Jagan: ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలను అమలులోకి తీసుకువస్తున్నారు. ఇక రాజకీయ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధి...
- Advertisement -
- Advertisement -