SriReddy: సమంతపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్లు.. ఏమైందంటే?

SriReddy: నటి సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ఆమె విడాకులపై స్పందించారు. ముఖ్యంగా చైతూతో ఆమె విడాకులు తీసుకోవడంపై అందరూ ఆమెనే విమర్శించారు.

 

సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్‌-2 సిరీస్‌ లో బోల్డ్ గా కనిపించడం వల్లే విడాకులు అంటూ విమర్శలు వచ్చాయి. ఇలా ఎంత మంది ఆరోపణలు చేసినా సమంత మాత్రం స్పందించలేదు. విడాకుల తర్వాత వరుసగా సినిమా షూటింగ్ లలో బిజీ అయిపోయింది.

 

ఇదిలా ఉండగా తాజాగా ఆమె మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇది చాలా అరుదైన వ్యాధి. కండరాలకు సంబంధించిన వ్యాధిగా తెలుస్తోంది.చాలామంది ప్రముఖులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమంతపై గతంలో శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.

 

సమంత పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

అక్కినేని చైతన్య -సమంత విడాకులు తీసుకున్న సమయంలో శ్రీరెడ్డి ఈ కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. చూడు సమంత వదినా నీ ముఖానికి హీరోయిన్‌ అయ్యే రేంజ్‌ లేదు. కానీ అయ్యావు. కానీ బుద్ధిగా సంసారం చేసుకోకుండా విడాకులు తీసుకుంటావా.. ఆ నమ్రతను చూసి నేర్చుకో. ఆమె కూడా పెద్ద హీరోయిన్‌ అయినా మహేశ్‌ కోసం సినిమాలను వదిలేసి బుద్దిగా సంసారం చేసుకుంటోంది. ఆమెను చూసి బుద్ధి తెచ్చుకో అంటూ దారుణంగా కామెంట్లు చేసింది. కానీ సమంత మాత్రం శ్రీరెడ్డి కామెంట్లపై స్పందించలేదు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -