Srisatya: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య అంత సంపాదించిందా?

Srisatya: బిగ్‌బాస్ సీజన్-6 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న వాళ్లందరూ వరుసగా షో నుంచి బయటికి వచ్చారు. ఈ వారం శ్రీసత్య కూడా ఎలిమినేట్ అయింది. ఆమె అదృష్టమో.. దురదృష్టమో తెలీదు కానీ గ్రాండ్ ఫినాలేకి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఎన్నో వారాలుగా కొందరు నెటిజన్లు ప్రారంభించిన ‘ఆపరేషన్ అసత్య’ అర్ధాంతరంగా ఆగిపోయింది. షో నుంచి శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలని మొదటి నుంచే ఆరోపణ వస్తుంది. అప్పటివరకు సేవ్ చేసిన బిగ్‌బాస్.. ఇప్పుడు ఆమెను టాప్-5లో ఉంచకుండా బయటకు పంపించాడు. దీంతో శ్రీసత్యను ఊహించని షాక్ తగిలింది.

 

 

బిగ్‌బాస్ షోను మొదట్లో పిక్‌నిక్ స్పాట్‌గా భావించిన ఈ భామ.. అందరి ఆటను చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చానన్నట్లే ఫీల్ అయ్యేది. ఆమె ప్రవర్తనను చూసి కంటెస్టెంట్‌లతోపాటు హోస్ట్ నాగార్జున సైతం మండిపడ్డారు. దీంతో ఆమె తన ప్రవర్తనను మార్చుకుంటూ వచ్చింది. మెల్లిమెల్లిగా ఆటపై ఫోకస్ పెట్టింది. అయితే శ్రీసత్య వేరే కంటెస్టెంట్‌ల నామినేషన్స్ చూసి బాగా ఎగతాళి చేసింది. గట్టిగా నవ్వడం, వెటకారంగా మాట్లాడేది. అలాగే రేవంత్ గురించి ముందు ఒకలా వెనకాల ఒకలా మాట్లాడేది. దీంతో ప్రేక్షకులు కూడా ఆమె ప్రవర్తనను చూసి తప్పుబట్టేవారు. ఎప్పుడైతే హౌస్‌కి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారో.. అప్పుడే ఆమె చేస్తున్న తప్పులు తెలిసింది. శ్రీసత్య నాన్న.. ‘నువ్వు ఇలా తయారయ్యావేంటీ? నా కూతురు ఇలా ఉండదు. ఊరికే గొడవలు పడటం.. వెటకారంగా మాట్లాడటం ఏంటి?’ అని నిలదీశాడు. దాంతో అప్పటి నుంచి శ్రీసత్య తన ప్రవర్తనను మార్చుకుంది.

 

 

అయితే అప్పటికే శ్రీసత్యను ఎలిమినేట్ చేయాలని ‘ఆపరేషన్ అసత్య’ స్టార్ట్ అయింది. కానీ ఫినాలేలో అడుగు పెడుతున్నానని సంబరపడుతున్న శ్రీసత్యకు మాత్రం భారీ షాక్ తగిలింది. షో నుంచి బయటికొచ్చిన శ్రీసత్య.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం ఆసక్తికరంగా మారింది. శ్రీసత్యకు బిగ్‌బాస్ వారానికి లక్ష రూపాయల చొప్పున చెల్లించినట్లు సమాచారం. దీంతో 15 వారాలపాటు ఉన్న శ్రీసత్య రూ.15 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -