Srisatya: పొద్దున్నే లేచి శ్రీసత్య ఎందుకు డ్యాన్స్ చేయదు?

Srisatya: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. అయితే హౌస్‌లో అందరికంటే శ్రీసత్యపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంది. ఆమె మనుషులను వాడుకుని వదిలేసే నైజాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆమె ఎలిమినేట్ అవ్వాలని మెజారిటీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే ఈ వారం వాళ్ల పేరెంట్స్ ప్రసాద్, శ్రీలత రావడం, ఆ ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉండటంతో శ్రీసత్యకు ప్లస్ పాయింట్‌గా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కదల్లేని స్థితిలో మంచానికే పరిమితం అయిన శ్రీసత్య తల్లిని చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు.

అయితే కూతురు శ్రీసత్య ప్రవర్తనపై హౌస్‌లో లైవ్‌లోనే ఆమె తండ్రి క్లాస్ పీకాడు. చెత్త చెత్త కారణాలతో హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేయవద్దని చురకలు అంటించాడు. ఒక్కసారి చేసినా, వంద సార్లు చేసినా తప్పు తప్పేనని.. మరోసారి నామినేషన్‌ల విషయంలో తప్పు చేయవద్దని హెచ్చరించాడు. ముఖ్యంగా కీర్తి విషయంలో శ్రీసత్య వెకిలి ప్రవర్తనపై వస్తున్న నెగివిటీని ఉద్దేశించి మందలించాడు. ఇకపై పద్ధతి మార్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. అయితే లైవ్‌లో జరిగిన చాలా సన్నివేశాలను ఎడిట్ చేసి అసలు ఎపిసోడ్‌లో నిర్వాహకులు ప్రసారం చేయలేదు.

కీర్తి విషయంలో ఫ్రెండ్‌గా ఉండాలని తన కుమార్తె శ్రీసత్యకు ప్రసాద్ సూచించాడు. అంతేకాకుండా కీర్తిని కూడా ఆయన బుజ్జగించాడు. శ్రీసత్య ఏమన్నా పట్టించుకోవద్దని కోరాడు. కీర్తి కూడా తన బిడ్డలాంటిదేనని.. తను కూడా తమతోనే ఉండొచ్చని ఆప్యాయంగా మాట్లాడాడు. ఎవరూ లేరని బాధపడొద్దని.. తమను తల్లి, తండ్రిగా భావించాలని కీర్తికి చెప్పాడు.

ఉదయాన్నే శ్రీసత్య డ్యాన్స్ ఎందుకు చేయడం లేదు?
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉదయాన్నే పాట ప్లే చేసి కంటెస్టెంట్లను నిద్ర లేపడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో కంటెస్టెంట్లు పాటకు డ్యాన్స్ చేస్తూ బిగ్‌బాస్‌కు గుడ్ మార్నింగ్ చెప్తారు. కానీ ప్రస్తుత సీజన్‌లో శ్రీసత్య వంటి వాళ్లు డ్యాన్స్ చేయడానికి బద్ధకిస్తున్నారు. దీంతో వాళ్ల నాన్న ఈ విషయంపైనా క్లాస్ పీకాడు. ఉదయాన్నే మార్నింగ్ సాంగ్‌కు ఎందుకు డాన్స్ చేయడం లేదని.. ఎప్పుడూ శ్రీహాన్, ఫైమా తప్ప నువ్వు ఎందుకు రావు.. డాన్స్ చేయవు అని శ్రీసత్య పేరెంట్స్ అడిగారు. అయితే టాస్క్‌లు ఆడి పులుసు కారిపోతుందని.. ఉదయాన్నే లేవలేకపోతున్నామని శ్రీసత్య సోది కారణాలు చెప్పడం గమనించాల్సిన విషయం.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -