SrNTR: సీనియర్ ఎన్టీఆర్ నే భయపెట్టిన పాత్ర ఏంటో మీకు తెలుసా?

SrNTR: తెలుగు సినిమా చరిత్రను చెప్పుకోవాలంటే.. తెలుగు సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎంతోమంది పేర్లను ప్రస్తావించాలి. ఇందులో ప్రముఖంగా వినిపించే పేర్లు ఎన్టీ రామారావు, నాగేశ్వర్ రావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖుల పేర్లను చెబుతారు. అయితే తెలగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కత్తి కాంతారావు గురించి మాత్రం ఎవరూ ప్రస్తావించరు.

తెలుగు లెజెండ్స్ గురించి మాట్లడేటప్పుడు ఎన్టీఆర్, ఎన్నార్, ఎస్వీఆర్ గురించి మాట్లాడే జనాలు.. తన తండ్రి గురించి ఎందుకు ప్రస్తావించరు అని కత్తి కాంతారావు ప్రశ్నించారు. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. తన తండ్రి కూడా ఎన్టీఆర్, ఎఎన్నార్ లకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసినట్లు వివరించారు.

తన తండ్రి కత్తి కాంతారావు హీరోగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారని.. ఆయన అప్పట్లోనే ఎంతో ఆస్తి, డబ్బును కలిగి ఉండే వారని ఆయన కూతురు వివరించారు. కానీ ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు మాత్రం లేకుండా పోయిందని.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కి సంబంధించిన ఈవెంట్ ఏది జరిగినా కత్తి కాంతారావు పేరు మాత్రం ప్రస్తావనకు రాకపోవడం బాధ కలిగిస్తుందని ఆమె అన్నారు.

ఇక తెలుగులో లెజెండ్ గా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ సైతం ఓ క్యారెక్టర్ అంటే భయపడే వాళ్లని కత్తి కాంతారావు కూతురు వెల్లడించారు. సినిమాల్లో నారదుడి క్యారెక్టర్ తాను వేయనని ఎన్టీఆర్ చెప్పే వారని.. ఏ వేషమైనా వేస్తాను కానీ ఒక్క నారదుడి వేషం మాత్రం వేయనని చెప్పే వాళ్లని.. అది మా బ్రదర్ కాంతారావుకే ఇవ్వాలని చెప్పే వారని ఆమె వివరించారు.

Related Articles

ట్రేండింగ్

AP Elections: ఏపీ ఎన్నికలలో వారసులు హిట్టా..? ఫట్టా..? ప్రజలు వీరిని ఆదరించడం సాధ్యమేనా?

AP Elections:  ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి వారసులకు పెద్దపీట వేశారు. ఇప్పటికే అధికార పక్షంలోనూ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల వారసులకు పలు ప్రాంతాలలో టికెట్లు ఇచ్చారు. ఈ...
- Advertisement -
- Advertisement -