SrNTR: ఎన్టీఆర్ వచ్చేవరకు తెలంగాణకు వరిఅన్నం తెలియదు!

SrNTR: ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు కాస్త దూసుకుడుగానే మాటలు, చేతలతో దూసుకెళ్తున్నారు పవన్‌. అయితే, ఈ క్రమంలో ఆయన కాస్త మాట తూలుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో జగన్‌ను తిట్టాలని ఇంకేవేవో మాట్లాడేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామం కూడా ఇదే సూచిస్తోంది.

 

తాజాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ మాట్లాడారు. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు అన్నం తినే వారు కాదని, ఏ పండగ, పబ్బానికో మాత్రమే అన్నం వండుకొని తినే వారని వ్యాఖ్యానించారు పవన్‌.

ఎన్టీ రామారావు వచ్చాకే అన్నం మెతుకులు తిన్నారని, ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి దేవుడయ్యాడంటూ పవన్‌ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. భాష, కళ, సంస్కృతి, జీవనవిధానం గురించి కామెంట్లు చేయడంపై ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం మండిపడుతున్నారు. ఎన్టీఆర్‌ వచ్చాకే రేషన్‌ బియ్యం చూశామా? అంతకుముందు తెలంగాణ చరిత్ర మీకు తెలియక ఇలా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

రాజకీయంగా ఎదిగే పద్ధతి ఇది కాదు..
రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోవాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నేరుగా జగన్‌ వైఫల్యాలను చెప్పి తాను ఏం చేయగలనో చెప్పాలని, అంతేకానీ జగన్‌ను ఎదుర్కోలేక మరొకరిపై నెపం నెడుతూ తానే దేవుడిననే భావనతో, అహంకార పూరితంగా ప్రసంగాలు చేయడం తగదని తెలంగాణ పండితులు ధ్వజమెత్తుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న చరిత్రను గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణపై చులకనభావం మానుకొని తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -