SS Rajamouli: ఆ విషయంలో రాజమౌళి మాత్రమే తోపా..?

SS Rajamouli: టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ దర్శకుడు రాజమౌళిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే పది కంటే ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులలో అసలు ఓటమి ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉంటే అది రాజమౌళి మాత్రమే. స్టూడెంట్ నంబర్‌వన్‌ మూవీతో కెరీర్ ప్రారంభించి సక్సెస్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తాను తీసిన 12 సినిమాలకు సంబంధించి ఒక సినిమాను మంచి మరో సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

 

స్టూడెంట్ నంబర్‌వన్, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న,ఈగ, బాహుబలి1, బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ఇండస్ట్రీ తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని రాజమౌళి లిఖించుకున్నాడు. సినిమాలు ఆలస్యంగా తెరకెక్కిస్తాడన్న అపవాదు ఉన్నా పక్కా స్క్రిప్టుతో తనదైన డెడికేషన్ చూపిస్తూ సినిమాలు తీస్తుండటంతో అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. అందుకే అభిమానులు అతడిని ముద్దుగా జక్కన్న అని పిలుస్తున్నారు.

 

ఒక సినిమా తీయడమే కాకుండా ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో కూడా రాజమౌళి అందరికీ నేర్పిస్తున్నాడు. ఈ విషయంలో రాజమౌళిని కొట్టే మగాడు లేడండూ ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఇటీవల జపాన్‌లో రిలీజ్ చేయగా తూతూమంత్రంగా ప్రమోషన్‌లు చేయకుండా రాజమౌళి స్వయంగా అక్కడికి వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. దీంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ఇంటర్నేషనల్ పత్రికలో రాజమౌళి గురించి స్టోరీ

రాజమౌళి టాలెంట్ ఇండియాకే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అతడికి అందరూ జేజేలు పలుకుతున్నారు. దీంతో అతడిని టాలీవుడ్ జేమ్స్ కెమరూన్ అని కూడా పిలుస్తున్నారు. తాజాగా రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలో ఎక్కువ సర్కులేషన్ ఉన్న పేపర్స్‏లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో జక్కన్నపై స్పెషల్ ఆర్టికల్ రాశారు. అది కూడా మొదటి పేజీలో బిగ్ పోస్టర్‌తో పబ్లిష్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు లాస్ ఏంజెల్స్ టైమ్స్ ఏ సినిమా సెలబ్రెటీ గురించి ఈ విధంగా పబ్లిష్ చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు డైరెక్టర్ రాజమౌళి కావడం భారతీయులకు గర్వకారణం అని అభిమానులు కీర్తిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో జగన్ ను దోషిని చేసేలా దస్తగిరి ప్రయత్నం.. ఏమైందంటే?

YS Viveka Murder Case: గత ఐదు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదని చెప్పాలి. ఈ కేసు సిబిఐ దర్యాప్తు...
- Advertisement -
- Advertisement -