SS Rajamouli: జపాన్‌లో ‘RRR’ సూపర్ హిట్.. ఆ రెండు సినిమాలను వెనకే!

SS Rajamouli:ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. మార్చి 24న విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సత్తా చాటింది. ఏకంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇటీవల ఈ సినిమాను చిత్ర బృందం జపాన్‌లో విడుదల చేసింది. ప్రయోషన్స్ లో భాగంగా అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ జపాన్ పర్యటనలో పాల్గొన్నారు. అయితే గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బహుబలి-2’ చిత్రం జపాన్‌లో మంది ఆదరణ లభించింది. ఈ సినిమాతో అక్కడ ప్రభాస్‌కు కూడా ఫ్యాన్ ఫాలొయింగ్ పెరిగింది. తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో ఇండియన్ మూవీగా రికార్డ్ సృష్టించింది.

 

 

అక్టోబర్ 21వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్‌లో విడుదల అయింది. ఆర్ఆర్ఆర్ టీమ్ జపాన్‌లో భారీ ఎత్తున ప్రయోషన్స్ నిర్వహించింది. ఫ్యామిలీలతో కలిసి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ జపాన్‌కు వెళ్లారు. అక్కడ ఈవెంట్స్ నిర్వహించడం, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం వంటి పనులు చేపట్టారు. జపాన్ ప్రజలకు దగ్గరై సినిమాను పబ్లిక్‌లోకి తీసుకెళ్లారు. అలాగే అక్కడి సోషల్ మీడియాలోనూ ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ ఎత్తున చర్చ జరిగింది. దీంతో గత ఇండియన్ సినిమాల రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చెరిపేస్తుందని భావించారు. అయితే ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదనే చెప్పుకోవచ్చు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ కేవలం 17 రోజుల రన్‌తో ముగిసింది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ ¥185 మిలియన్లు మాత్రమే వసూలు చేసింది. రజనీకాంత్ ముత్తు ¥400 మిలియన్స్ తో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత బహుబలి-2 రికార్డులు బ్రేక్ చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నిలిచింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -