Akkineni Akhil: అక్కినేని హీరో గురించి స్టార్ డైరెక్టర్ అలా అన్నారా?

Akkineni Akhil: అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన నాగార్జున ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, నట వారసులుగా వచ్చిన ఇద్దరు కుమారుల్లో ఒకరు సెటిల్ అయ్యారు. నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీ వైపే వచ్చారు. తొలుత నాగచైతన్య జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత ఏం మాయచేశావే సినిమాతో నిలదొక్కుకున్నాడు. అనంతరం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రతి సినిమాకూ ఓ మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు.

అయితే, అఖిల్ మాత్రం ఇంకా కెరీర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టలేదు. వచ్చిన అన్ని సినిమాలూ యావరేజ్, బిలో యావరేజ్ గానే నిలుస్తున్నాయి. ఇప్పటి మూడు సినిమాల్లో హీరోగా నటించాడు అఖిల్. నటన, డ్యాన్స్ పరంగా కుర్రాడు బాగానే చేస్తున్నాడనే అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది. అయితే, కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నారు.

ఏజెంట్ తో అయినా హిట్ దక్కుతుందా?

తాజాగా అఖిల్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి పాన్ ఇండియా లెవల్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలో తన బాడీని కూడా షేప్ మార్చేశాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రంలో రా ఏజెంట్ గా కనిపించనున్నాడు అఖిల్. ఈ చిత్రంలో ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండేది.

అఖిల్ చిత్రం కోసం చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు హిట్ కొడతాడా అని ఎదురు చూస్తున్నారు. వారికి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య, చిరు ఉన్నారు. మరి వీరి సినిమాలను తట్టుకొని పోటీలో నిలబడతాడా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇద్దరు బడా హీరోల మధ్య పోటీలో నిలవగలవా? అని కామెంట్లు చేస్తున్నారు. ఓ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -