Niharika: నిహారికకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. ఏమైందంటే?

Niharika: సీనియర్ నటుడు నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ఆమె ఎప్పుడూ చలాకీగా ఉంటూ జనాల నోర్లలో తన పేరు నానేలా చూసుకుంటారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ.. సరైన హిట్ పడకపోవడంతో యాక్టింగ్‌ను తగ్గించేశారు. జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని ఆమె సెటిలయ్యారు. అప్పటి నుంచి చిత్రాల్లో నటించడాన్ని పూర్తిగా మానేశారు. వెబ్ సిరీస్ ల నిర్మాణంలో నిహారిక బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు నిరాశలో ఉన్నారు. మళ్లీ నిహారికను సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.
ఇదిలాఉంటే.. పెళ్లి తర్వాత నుంచి నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు నిహారిక. ఆ మధ్య ఓ పబ్బులో దొరికినప్పుడు మీడియాలో ఎంత రచ్చ జరిగిందో చూసే ఉంటారు. ఆ తర్వాత కూడా కాంట్రవర్సీలు ఆమెను వీడలేదు. ఇప్పుడు నిహారికకు సంబంధించి ఓ రూమర్ వైరల్ అవుతోంది. భర్త చైతన్యకు ఆమె దూరంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబుతున్నారంటూ రూమర్స్ గుప్పుమంటున్నాయి.
భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక!
గత కొన్నాళ్లుగా చైతన్య–నిహారికలు దూరంగా ఉంటున్నారని వినికిడి. పెద్దలకు చెప్పకుండానే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారట. పైగా నిహారిక తన ఫ్యామిలీ ఫంక్షన్లకు ఒంటరిగానే వెళ్తున్నారని సమాచారం. భర్తకు సంబంధించిన ఎలాంటి ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. దీంతో ఈ విషయంపై మాట్లాడేందుకు మెగా హీరో వరుణ్ తేజ్.. సోదరి నిహారికను పిలిచి హెచ్చరించారని తెలుస్తోంది. ఇలాంటి పనులు చేసేముందు ఇంట్లో పెద్దలతో మాట్లాడాలని ఆయన వార్నింగ్ ఇచ్చాడట. ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే బాగోదని గట్టిగానే చెప్పాడట. ఏదైనా సమస్య ఉంటే పెద్దలతో డిస్కస్ చేయాలని సూచించాడట. వేరుగా ఉండటం మంచిది కాదని నిహారికకు వరుణ్ సర్దిచెప్పాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అప్పటినుంచి భర్తకు దగ్గరవ్వడానికి నిహారిక ప్రయత్నాలు మొదలుపెట్టిందని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -