Prabhas: బన్నీని చూసైనా స్టార్ హీరో ప్రభాస్ మారక తప్పదా?

Prabhas: బాహుబలి సినిమాతో ఓ రేంజ్ స్టార్ గా ఎదిగిపోయారు ప్రభాస్. అప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే తెలిసి ఈ హీరో.. ఆ మూవీ తర్వాత మాకాం అంతా ముంబయికి షిప్టు చేశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పాన్ ఇండియా మూవీలను పట్టారు. కానీ పెద్దగా హిట్ మాత్రం కాలేదు. సాహో వంటి సినిమా తెలుగులో తిరస్కార భావం ఎదుర్కొంటే, హిందీలో మాత్రం ఆదరణకు నోచుకుంది. ఇలా ప్రభాస్‌ పట్ల నార్త్‌ లో ఆదరణ కనిపించింది.

 

అయితే రాధేశ్యామ్‌ తో ప్రభాస్‌ కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. రాధేశ్యామ్‌ హిట్‌ అయి ఉంటే, ప్రభాస్‌ ఆలిండియన్‌ స్టార్‌ హీరోగా తిరుగులేని స్థితికి చేరుకునేవాడు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోవడం, మరోవైపు ఆదిపురుష్‌ ఔట్‌ పట్ల అనేక సందేహాలు నెలకొని ఉండటం కూడా ప్రభాస్‌ కు ఇబ్బందికరంగా మారింది. అయితే చేతిలో ఉన్న సినిమాలు ప్రభాస్‌ తదుపరి స్థాయిని నిర్ణయించబోతున్నాయి. ఇవేమీ మాములు ప్రాజెక్టులు కావు కాబట్టి ప్రభాస్‌ బౌన్స్‌ బ్యాక్‌ భారీ ఎత్తున ఉండవచ్చనే అంచనాలు లేకపోలేదు.

ఇప్పుడు ఆసంగతలు పక్కకు పెడితే ప్రభాస్‌ కాస్త వెనక్కు తగ్గినట్టుగా అగుపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభాస్‌ కు పోటీ ఇచ్చేలా దూసుకువస్తున్నాడు అల్లు అర్జున్‌. వాస్తవానికి ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌.. వీళ్లందరి కన్నా ముందుగా పక్క రాష్ట్రంలో తనకంటూ ఉనికిని చాటుకున్నది అల్లు అర్జునే.
మలయాళంలో తనకంటూ ఒక మార్కెట్‌ ను సృష్టించుకున్నాడు. అది అలా ముందుగా అల్లు అర్జున్‌ కు కలిసి వచ్చింది. ఇక ఇటీవలి సినిమాలతో అల్లు అర్జున్‌ తెలుగు వాళ్ల కన్నా పక్క రాష్ట్రాల వారినే బాగా ఆకట్టుకున్నాడు. ప్రభాస్‌ తర్వాత అటు నార్త్‌ లో అయినా, కర్ణాటక తమిళనాడుల్లో అయినా అల్లు అర్జున్‌ కే ఇప్పుడు మంచి గుర్తింపు దక్కుతోంది.

 

ఇది తెలుగు హీరోలకు భారీ స్థాయికి ఆరంభం మాత్రమేనేమో. తెలుగు రాష్ట్రాల్లో వీరికి భారీ మార్కెట్‌ ఉండటం, ఆ పై పక్క భాషల్లో కూడా వీరి సినిమాల విడుదలలకు బ్రహ్మాండమైన క్రేజ్. అలాగే హిందీ బెల్ట్‌ థియేటర్లలో వీరి సినిమాలకు స్టడీ కలెక్షన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తే వీరి మార్కెట్‌ రేంజ్‌ భారీగా నమోదవుతుంది. అయితే ఈ క్రేజ్‌ లు ఒకటీ రెండు సినిమాలకు పరిమితం కాకుండా.. వీటిని స్టడీగా కొనసాగించడం మాత్రం వీరి సినిమాల జయాపజయాల మీదే ఆధారపడి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Vanga Geetha: వైసీపీ వంగా గీతకు ప్రజల్లో తిరస్కారం వెనుక అసలు లెక్కలివేనా.. ఏం జరిగిందంటే?

Vanga Geetha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అందరూ చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కాపు...
- Advertisement -
- Advertisement -