Prabhas: స్టార్ హీరో ప్రభాస్ తొలిసారి అలా కనిపించనున్నారా?

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ పక్క కమర్షియల్ డిజాస్టర్ అందించిన డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఫుల్ హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అంటే అందరిలోనూ ఓ మార్క్ ఏర్పడింది. ప్రభాస్ అంటే భారీ బడ్జెట్ సినిమాలేనని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మారుతి వంటి డైరెక్టర్ కు అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో ఫుల్ లెన్త్ కామెడీ పాత్రలో చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ తన స్టార్ట్ మొత్తం పక్కన పెట్టి ఈ సినిమాలో చాలా కామెడీ పాత్రలలో నటించబోతున్నారని సమాచారం.

 

ఇకపోతే త్వరలోనే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ చాలా విభిన్నమైన లుక్ లో విడుదల చేయాలని డిజైన్ చేశారట. ఈ లుక్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం మొదలైంది. మారుతి సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌.. మాస్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.

 

తొలిసారి ప్రభాస్ కెరీర్లో లుంగీ‌తో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారట. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అంటే భారీతనం అన్నట్లు తయారైపోయింది. ఇదొక బ్యాగేజీ లాగా మారిపోయింది. ఐతే అవన్నీ పక్కన పెట్టేసి ఒక క్యాజువల్ లుక్‌తో ప్రభాస్ దర్శనం ఇవ్వబోతున్నారని తెలిసి అందరూ కూడా ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -