Ram Charan: మంచి మనస్సు చాటుకున్న స్టార్ హీరో రామ్ చరణ్.. దేవుడంటూ?

Ram Charan: చిరంజీవికి మరియు మెగా కుటుంబానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నూర్ మహమ్మద్ చిరంజీవికి మరియు మెగా కుటుంబానికి వీరాభిమాని. హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నూర్ మహమ్మద్ డిసెంబర్ 8న గుండె పోటుతో మరణించారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఆ కుటుంబానికి అండగా నిలిచి తన సహృదయాన్ని చాటుకున్నాడు.

 

రామ్ చరణ్ చేసిన ఈ పనితో అతను రీల్ హీరో కాదు, రియల్ హీరో అని మరోసారి నిరూపించబడింది. నూర్ మహమ్మద్ చనిపోయినప్పుడు మెగా కుటుంబంలోని సభ్యులు చాలామంది అతని ఇంటికి వెళ్లి నూర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ సమయంలో విదేశాలలో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ తిరిగి వచ్చిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల రూపాయల నగదు అందించాడు.

 

అంతేకాకుండా నూర్ మహమ్మద్ తమ కుటుంబం కోసం చేసిన సేవలను తామెప్పటికీ మర్చిపోమని, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని రామ్ చరణ్ మీడియాతో చెప్పాడు. తాను ఈ కుటుంబానికి పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకుంటానని, నూర్ మహమ్మద్ కూతుర్లకు పెళ్లి చేసే పూచీ తనదే అని హామీ ఇచ్చారు.

 

ఈ క్రమంలో ఇటీవల అతనికి లభించిన అవార్డును సైతం ఆయన నూర్ మహమ్మద్ కు అంకితం ఇచ్చారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ ‘ది పీపుల్స్ ఎంటర్‌టైనర్ పార్ ఎక్సలెన్స్ అవార్డు’ను అందుకున్న సందర్భంలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా తమ ఎదుగుదలకు తమ అభిమానులు కీలక పాత్ర పోషిస్తారని. వాళ్ల సపోర్ట్ వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చామని. అందుకే నూర్ మహమ్మద్ కు జోహార్లు అర్పిస్తూ తన అవార్డును అతను అంకితం ఇస్తున్నట్లు రామ్ చరణ్ ప్రకటించాడు. సినిమా స్టార్లను అభిమానించే అభిమానులకు కొదవలేదు. కానీ తమను ఎంతో ప్రేమించే అభిమానులను అక్కున చేర్చుకునే స్టార్ హీరోలు మాత్రం చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఈ విషయంలో మెగా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందనేదానికి ఈ సంఘటన మరొక నిదర్శనం.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -