Stars: ఈ సెలబ్రిటీలు స్టార్స్ కావడానికి బుల్లితెర కారణమా?

Stars: సినిమాల్లో ఛాన్స్ కోసం కొన్ని వందల మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొందరికే అదృష్టం వరిస్తుంది. సైడ్ క్యారెక్టర్లు, కమెడియన్ పాత్రలు చేసే వారు హీరోలు అవడం, బుల్లి తెరలో సీరియల్స్‌లో చేస్తూ వెండితెరలో సత్తా చూపడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో కొందరు సూపర్ స్టార్లుగా మారారు.

 

సీరియల్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా..
కేజీఎఫ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. అతను సినిమాల మీద ఆసక్తితో టీనేజీలోనే ఇంటి నుంచి పారిపోయాడు. థియేటర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. సీరియళ్లలో అవకాశం పొందాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా చాన్స్ కొట్టేసి, ఇప్పుడు అదరగొడుతున్నాడు.

 

ప్రజెంటర్ నుంచి లేడీ సూపర్ స్టార్‌గా..
లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కూడా మొదట ఓ మలయాళం ఛానల్‌లో ప్రజెంటర్‌గా- ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, సౌందర్యోత్పత్తులు, నగలు, గ్యాడ్జెట్లు, సెలబ్రిటీల విషయాలెన్నో పంచుకునేది. దాదాపు ఏడాదిపాటు అక్కడ పని చేసిన నయన్‌ ఆ తరవాతే సినిమాల్లో ఛాన్స్‌లు దక్కించుకుంది.

 

అలాగే సాయిపల్లవి మొదట ఈటీవీలో వచ్చే డాన్స్ షోలో మెరిసింది. అమ్మానాన్నలకోసం మెడిసిన్‌ చదివింది. ఆ తరవాతే సినిమాల్లోకి అడుగుపెట్టింది. నటి నజ్రియా కూడా పదకొండేళ్లకే ఓ మలయాళీ ఛానల్‌లో క్విజ్ ప్రోగ్రామ్‌కి యాంకరింగ్‌ చేసింది. ఆ తరవాత చదువుకుంటూనే మ్యూజిక్‌, చాట్‌షోల్లోనూ దాదాపు ఏడేళ్లపాటు వ్యాఖ్యాతగా పని చేసింది. ఇప్పుడు హీరోయిన్‌గానూ అవకాశాలు అందుకుంటోంది.

 

సీతారామం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ మొదట్లో మోడలింగ్ చేసేది. 2012లో ‘ముఝే కుఛ్‌ కెహ్‌తీ హై ఖామోషియా’ అనే సీరియల్‌లో అవకాశమొచ్చింది. ఆ తరవాత వరుసగా సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -