Stunts: ప్రమాదపుటంచున భార్యా భర్తల స్టంట్స్‌.. నెటిజన్స్‌ ఫైర్‌!

Stunts: ఈ రోజుల్లో బైక్‌ స్టంట్స్‌ చేయడం సాధారణమైంది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా స్టంట్స్‌ చేస్తున్నారు. ఇలా స్టంట్స్‌  చేయడమంటే మామూలు విషయం కాదు. దాన్ని కోసం ఎళ్ల తరబడి కఠోర సాధన చేయాల్సి వస్తోంది. అల చేసిన వారే స్టంట్లను కన్ఫిడెండ్‌గా చేస్తారు.  ఇప్పుడైతే విశాలమైన ప్రదేశాల్లోకెళ్లి  స్టంట్లు చేయడం వాటిని సోషల్‌  మీడియాలో పెట్టడం సాధారణమైంది.  నేటి యువత అలాంటి వీడియోలనను ఎక్కువగా చూస్తున్నారు. అయితే స్టంట్స్‌ చేయడం చట్టవిర్ధుమని కొన్నిసార్లు ప్రాణాలు సైతం పోతున్నాయని పోలీసులు స్టంట్స్‌ చేస్తున్న వారిని శిక్షిస్తున్నారు. అయినా కొందరు మానడం లేదు. ఇటీవల స్టంట్స్‌ చేస్తూ చాలా మంది యువకులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారు.

 

కొందరు రోడ్లపై చేసే స్టంట్స్‌తో వారి పాటు ఇతర వాహనాలకు కూడా ఇబ్బంది కలిగిస్తుంటారు.  స్టంట్స్‌ సమయంలో అదుపు తప్పితే వారితో పాటు పక్కనుంచి వెళ్తున్న వాహనదారులు సైతం ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన స్టంట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఓ వ్యక్తి తన భార్యను రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ (బుల్లెట్‌)పై వెళ్తుంటారు. కాసేపటి తర్వాత ఆ యువకుడు మెల్లిగా బుల్లెట్‌ హాండిల్‌ను కంట్రోల్‌ చేస్తూ చేతులను వదిలేస్తాడు.  బ్యాలెన్స్‌ కంట్రోల్‌ చేస్తూ రెండు కాళ్లు బైక్‌ సీట్‌పై పెట్టి నిటారుగా నిలబడగా బైక్‌ దానంతకు అదే వెళ్తుంటుంది.
 వెనక కూర్చున్న అతడి భార్య ఏమాత్రం భయపడకుండా కూర్చునే ఉంటుంది. అలా వెళ్తున్న వారిని పక్క నుంచి మరో వ్యక్తి వీడియో తీస్తుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కడివే స్టంట్‌ చేయడం తప్పు.. పైగా భార్యను కూడా ఇలా ప్రమాదంలో పడేలా స్టంట్స్‌ చేయడం తప్పని ఒకరు.. వీడికి సమయం దగ్గరపడిందని మరొకరూ కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైనా కానీ.. ఈ వీడియో మాత్రం వైరల్‌ కావడంతో చాలా కొందరు లైక్స్, షేర్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -