Subbai Gudem: తల్లితండ్రి మందలించారని అలాంటి పని చేసిన డిగ్రీ విద్యార్థి?

Subbai Gudem: ప్రస్తుత సమాజంలో యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకొని క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారని ఇలా చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నూరేళ్లు హాయిగా జీవించాల్సిన వాళ్ళు పాతికేళ్లు కూడా నిండని ముందే వారి జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. అయితే చదువుకున్న యువత కూడా ఆత్మహత్యలకు పాల్పడడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం సుబ్బాయి గూడెంకు చెందిన పసుపులేటి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి దంపతులు స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద అమ్మాయికి వివాహం చేయగా, రెండో కుమార్తె హరీష డిగ్రీ చదువుతోంది. హరీష నందిగామలోని ఓ ప్రైవేటు కాలేజీలో హరీష డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమెను అప్పుడప్పుడు అనారోగ్యాలు వెంటాడేవి. అలానే ఇటీవల హరీష కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కాలేజికి రోజూ వెళ్లడం లేదు. తల్లిదండ్రులు అడగ్గా అనారోగ్యంగా ఉందని చెప్పేది. ఈ నేపథ్యంలోనే హరీషను తల్లిదండ్రులు మందలించారు.

 

దాంతో మనస్తాపానికి గురైన హరీష తల్లీ తండ్రి మందలించారని గడ్డి మందు తాగింది.
అది హరీషను గమనించిన హరీష తల్లిదండ్రులు వెంటనే నందిగామ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు విజయవాడకు తరలించమని చెప్పడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ హరీష తాజాగా మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు గుండెలు విలసేలా రోధించారు. అయితే మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -