Gundu Sudarshan: గుండు వల్ల అలాంటి సుఖం.. గుండు సుదర్శన్ కామెంట్స్ వైరల్!

Gundu Sudarshan: మామూలుగా ఎవరైనా సరే జుట్టు పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పొరపాటున వెంట్రుకలు ఊడినట్లు కనిపిస్తే చాలు ఎక్కడ బట్టతల వస్తుందో, పూర్తిగా గుండు అవుతామేమో అని తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే జుట్టు పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ గుండుకున్న సుఖం ఎవరికి తెలియదు అంటూ ఒక నటుడు షాకింగ్ కామెంట్ చేశాడు. ఇంతకు ఆ నటుడు ఎవరో కాదు గుండు సుదర్శన్.

తెలుగు ప్రేక్షకులకు గుండు సుదర్శన్ బాగా పరిచయం ఉన్న నటుడు అని చెప్పాలి. ఎన్నో హాస్య పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. నటుడు గానే కాకుండా రచయితగా కూడా బాధ్యతలు చేపట్టాడు. నటుడుగా 350 సినిమాలకు పైగా నటించి మర్చిపోలేని నటుడుగా ముద్ర సంపాదించుకున్నాడు.

 

మొదటిసారి ఈయన 1993లో మిస్టర్ పెళ్ళాం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అలా అప్పటినుంచి ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. బుల్లి తెరపై పలు సీరియల్స్లలో కూడా చేశాడు ఈయన. ఇక ఈయనను ఎప్పుడు చూసిన గుండుతోనే ఉంటాడు కాబట్టి తనకు గుండు సుదర్శన్ అని పేరు వచ్చింది.

 

అంటే తన ఇంటిపేరు కాస్త గుండుగా మారిపోయింది. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వీడియో బాగా వైరల్ అవుతుంది. అందులో ఆయన తన గుండు గురించి సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. ఇప్పుడు తనకున్న సుఖం ఎవరికి ఉంటుంది అంటూ నవ్వుతూ మాట్లాడాడు.

 

ఆయనకు ఒకప్పుడు ఉంగరాల జుట్టు ఉండేది అని.. కానీ ఇప్పుడు గుండుతో చాలా సుఖం ఉందని.. జుట్టు ఉంటే ఎప్పుడూ దానిమీద దృష్టి ఉంటుంది అని.. ప్రతిసారి దాని పట్ల శ్రద్ధ తీసుకోవాలి అని.. అదే గుండు ఉంటే అలా కాదు అని అన్నాడు. ఏదో ఒక సినిమాలో గుండుతో కనిపించడం వల్ల అది బాగుందని.. ఆ తర్వాత చాలామంది దర్శకులు కూడా తనను అలాగే ఉండమని అనడంతో అలాగే ఉండిపోయాను అని తెలిపాడు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -